Samantha Birthday Special 2022: సమంత ఆస్తుల విలువ తెలుసా? ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్..
Naga Chaitanya Ex-wife Samantha Net Worth 2022 : విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన కార్లు మాత్రమేకాకుండా కోట్లలో ఆస్తులను కూడబెట్టిన దక్షిణాది నటి..
Updated on: Apr 28, 2022 | 8:51 PM

దక్షిణ సినీ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పుట్టిన రోజు నేడే (ఏప్రిల్ 28). నేటితో 34 ఏళ్లు పూర్తి చేసుకుని 35వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొన్ని ముఖ్య విశేషాలు మీకోసం..

సినిమారంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్న ఏకైక నటి సమంత.

శక్తి వంతమైన మహిళల్లో సమంత కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కష్టపడి పైకొచ్చింది. నటనలో ఆమెకామెసాటి. కూడబెట్టిన ఆస్తులు కూడా తక్కువేం కాదు. ఆమె ఆదాయ వనరు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

Caknowledge.com నివేదికల ప్రకారం.. సమంత మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 80 కోట్లు అని పేర్కొంది.

ఆమెకు సొంతగా ఓ లగ్జరీ హౌస్ కూడా ఉంది. అందులో కుటుంబంతో కలిసి నివసిస్తోంది. అంతే కాకుండా సమంత దగ్గర లగ్జరీ కార్లు, ఇతర వాహనాలు కూడా ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం.. సమంత వద్ద ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, పోర్షే కేమాన్ జీటీఎస్, మెర్సెడెస్ బెంజ్, ఆడీ వంటి విలువైన వాహనాలున్నట్లు పేర్కొంది.

సమంత ఒక సినిమాకి 3 నుంచి 4 కోట్లు తీసుకుంటుందట.

విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన కార్లు మాత్రమే కాకుండా సమంత వద్ద లక్షల విలువైన బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.




