- Telugu News Health Yoga Pose: Men can reap these health benefits by doing a butterfly posture every day
Butterfly Pose: ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పురుషులకు సీతాకోకచిలుక భంగిమ బెస్ట్ రెమిడీ
Butterfly Pose: ఎవరికైనా సరే ఆయాసం, జబ్బులు, ఇతర శారీరక సమస్యలు వస్తే తొందరగా తగ్గవు. కనుక సరైన ఆహారం, యోగా రోజువారీ కార్యక్రమంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. పురుషులు ప్రతిరోజు సీతాకోకచిలుక భంగిమ యోగాసనం వేయడం వలన అనేక సమస్యల నుండి బయటపడవచ్చు.
Updated on: Apr 28, 2022 | 3:35 PM

స్త్రీల మాదిరిగానే పురుషులు కూడా చిన్న వయస్సులోనే అనేక శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనుక సరైన ఆహారం, దినచర్యను అనుసరించడం ఉత్తమం. అదే సమయంలో చురుకుగా ఉండడానికి యోగాసనాలను వేయడం మంచిఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా సీతాకోకచిలుక భంగిమ చేయడం ద్వారా పురుషులు తమను తాము చురుకుగా, ఫిట్‌గా ఉంచుకోవచ్చు.

ఒత్తిడికి దూరంగా: సంతోషకరమైన జీవితంలో సాధారణంగా ప్రతి ఒక్కరూ ఒత్తిడి సమస్యకు గురవుతున్నారు. దీని వల్ల మంచి నిద్ర పట్టదు. అలసట ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఉదయాన్నే సీతాకోకచిలుక భంగిమ చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

.కండరాలు బలపడతాయి: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పురుషులు ప్రతిరోజూ సీతాకోకచిలుక భంగిమలు చేస్తే, అది వారి కండరాలకు కొత్త జీవనాన్ని ఇస్తుంది. చాలా కాలం పాటు కండరాలు బలంగా ఉండేలా చేస్తుంది.

స్టామినా పెంచుకోండి: రోజు రోజుకీ పెరుగుతున్న పని ఒత్తిడి, బిజీ షెడ్యూల్స్.. దీంతో తమకు శక్తికి మించిన పనులు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఒత్తిడిని తట్టుకునే స్టామినాను పెంచుకోవడానికి సీతాకోకచిలుక భంగిమ మంచి సహాయకారి. సీతాకోకచిలుక భంగిమ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

కీళ్ల నొప్పులు: 30 ఏళ్ల తర్వాత, మోకాళ్ల నొప్పులు వచ్చే ప్రమాదంతో సహా పురుషులలో జాయింట్స్‌లో నొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మోకాళ్ల నొప్పులతో పాటు..ఇతర కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి పురుషులకు సీతాకోకచిలుక భంగిమ సహాయం చేస్తుంది.




