Mango Kernels Benefits: మామిడిపండు తిని పిక్క పడేస్తున్నారా? ఈ 5 బెనిఫిట్స్ తెలిస్తే ఇక అలా చేయరు..!

Mango Kernels Benefits: వేసవి కాలంలో మామిడి పండ్లు రాజ్యమేలుతాయి. ఏ మార్కెట్‌కు వెళ్లినా మామిడి హవానే ఉంటుంది. ఎందుకంటే మామిడి పళ్ళకు ఉండే క్రేజ్ అలాంటిది మరి.

Mango Kernels Benefits: మామిడిపండు తిని పిక్క పడేస్తున్నారా? ఈ 5 బెనిఫిట్స్ తెలిస్తే ఇక అలా చేయరు..!
Mango Seeds
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 28, 2022 | 6:21 PM

Mango Kernels Benefits: వేసవి కాలంలో మామిడి పండ్లు రాజ్యమేలుతాయి. ఏ మార్కెట్‌కు వెళ్లినా మామిడి హవానే ఉంటుంది. ఎందుకంటే మామిడి పళ్ళకు ఉండే క్రేజ్ అలాంటిది మరి. మామిడి కాయ తినడానికి విపరీతమైన ఆసక్తి చూపుతారు జనాలు. అయితే, చాలా మంది మామిడి పండులో పండునంతా తినేసి.. మామిడి కాయలోని చిప్పను పడేస్తారు. అయితే, మామిడి కాయలో ఉండే ప్రయోజనాలకంటే.. మామిడి చిప్పలో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మామిడిలో అనేక రకాల విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, సీజనల్ ఫ్రూట్ అయిన ఈ మామిడి పండును తింటే బరువు పెరుగుతారనే ఉద్దేశ్యంతో చాలా మంది మామిడి పండును తినడానికి ఇష్టపడరు. మధుమేహం ఉన్నవారు కూడా ఈ మామిడిపండ్లకు దూరంగా ఉంటారు. అయితే, ఈ ఆలోచన సరైనిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. మధుమేహ బాధితులు సైతం మామిడి పళ్లను తినొచ్చని చెబుతున్నారు.

అయితే, తాజాగా మామిడి పళ్లపై పరిశోధకులు జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగోకి వచ్చాయి. ముఖ్యంగా మామిడి పళ్లు, మామిడి చిప్పపై షాకింగ్ విషయాలను వెల్లడించింది. మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉంటే.. మామిడి గింజలు తినడ వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందట. వ్యక్తి శరీరంలోని కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందట. దాంతోపాటు అనేక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని అధ్యయనకారులు చెబుతున్నారు. మామిడిలో ఖనిజాలు, విటమిన్లు ఉన్నట్లే.. మామిడి గింజ, విత్తనంలోనూ అంతకు మించిన పోషకాలు ఉన్నాయని చెపపారు. విటమిన్లు ఏ, సీ, ఇ, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఫోలేట్‌లు ఉంటాయి. మామిడి గింజలో మాంగిఫెరిన్ కూడా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లకు చాలా మంచి మూలం. యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ లాంటి ప్రమాదాల నుంచి మన కణాలను రక్షిస్తాయని పేర్కొన్నారు నిపుణులు. ఇక మామిడి గింజలు బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటాయని పేర్కొన్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.

ఉదర సంబంధిత వ్యాధులకు చెక్.. దీర్ఘకాలిక ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. అతిసారంతో బాధపడేవారు మామిడిపండు గింజను తింటే.. ఫలితం ఉంటుంది. చాలా కాలంగా విరేచనాలు, ఇతర ఉదర సమస్యలు ఉన్నవారు.. మామిడి గింజలను ఎండబెట్టి చూర్ణం చేసి తింటే ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనెతో పొడిని కలపండి. ఈ మిశ్రమం అనేక ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణ.. ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ సమస్యను నియంత్రించడంలో మామిడి గింజల పాత్ర ఉంది. మామిడికాయ గింట పొడిని తినడం, లేదా పొడిని పాలలో వేసుకుని తినడం ద్వారా కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయొచ్చు.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో.. ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. గుండె సమస్యలను నియంత్రించడంలో మామిడి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ ఒక చెంచా ఎండు యాలకుల పొడిని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఎసిడిటీ సమస్యను అధిగమించడానికి.. ఎసిడిటీ వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో మామిడి గింజలు అద్భుతంగా పని చేస్తాయి. మామిడి గింజల్లో మన జీర్ణక్రియకు మేలు చేసే ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

(గమనిక: సాధారణ ప్రజాప్రయోజనాలను దృష్టించుకుని ఆయుర్వేదంలో పేర్కొన్ని చిన్న టిప్స్‌ని ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే.. నిపుణులను సంప్రదించి చికిత్స పొందడం ఉత్తమం.)

Also read:

WhatsApp pay: వాట్సప్ సూపర్ ఆఫర్.. ఇలా చేస్తే క్యాష్ బ్యాక్ మీ సొంతం!

Nikhil Siddhartha: యంగ్ హీరో ఇంట్లో విషాదం.. నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ్ కన్నుమూత

NPCIL Recruitment 2022: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులకు నేటితో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..