AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు.. కిచ్చా సుదీప్‏కు సపోర్ట్‏గా ఆర్జీవీ ట్వీట్..

కన్నడ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హిందీ జాతీయ భాష కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Ram Gopal Varma: నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు.. కిచ్చా సుదీప్‏కు సపోర్ట్‏గా ఆర్జీవీ ట్వీట్..
Ram Gopal Varma
Rajitha Chanti
|

Updated on: Apr 28, 2022 | 1:06 PM

Share

కన్నడ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హిందీ జాతీయ భాష కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సుదీప్ మాటలను వ్యతిరేకిస్తూ బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ ట్విట్టర్ వేదికగా హిందీ ఎప్పటికీ జాతీయ భాషే అని.. అందుకే హిందీలోకి సినిమాలను డబ్ చేస్తున్నారు కదా అంటూ కౌంటరిచ్చారు. దీంతో సుదీప్, అజయ్ మధ్య ట్వీట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. తాను మాట్లాడిన మాటలు.. ట్రాన్స్‏లేషన్ పొరపాటు వలన వేరేగా అర్థం చేసుకున్నారంటూ సుదీప్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. అజయ్ దేవగణ్ మాత్రం ట్విట్టర్‏ వార్ మాత్రం కొలిక్కి రాలేదు. మరోవైపు వీరిద్దరి మాటల యుద్ధం పై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య.. కిచ్చా సుదీప్‏కు మద్దతుగా హిందీ జాతీయ భాష కాదంటూ అజయ్ దేవగణ్‏కు కౌంటరిచ్చారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం సుదీప్‏కు మద్దతుగా ట్వీట్ చేశాడు..

” ఇది కాదనలేని నిజం సుదీప్ సార్.. నార్త్ స్టార్స్ సౌత్ స్టార్స్ పై అసూయతో.. అభద్రత భావంతో ఉన్నారు. ఎందుకంటే.. కన్నడ డబ్బింగ్ సినిమా కేజీఎఫ్ 2 విడుదలైన రోజే రూ. 50 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో హిందీ సినిమాల ప్రారంభ రోజలను చూడబోతున్నాము.. ” అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి.

ముందుగా అజయ్ హిందీలో ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. హిందీ జాతీయ భాష కాకపోతే సౌత్ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు అంటూ అజయ్ హిందీలో ట్వీట్ చేశారు. దీంతో సుదీప్ అజయ్‏కు తనదైన శైలీలో సమాధానమిచ్చారు. మీరు చేసిన ట్వీట్ నాకు అర్థమైంది.. హిందీలో పంపిన టెక్ట్స్ నాకు అర్థమైంది. నేను హిందీ భాషను గౌరవిస్తాను.. ప్రేమిస్తాను.. కేవలం ట్రాన్స్ లేషన్ వల్లే పొరపాటు జరిగింది. నేను కన్నడలో రిప్లై ఇస్తే ఎలా అని అలోచిస్తున్నా అంటూ రీట్వీట్ చేశారు సుదీప్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..

Kaathu Vaakula Rendu Kadhal Twitter Review: కాతువాకుల రెండు కాదల్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. సమంత హిట్ కొట్టేనా ?

KGF 2 Yash: కేజీఎఫ్ 3 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాఖీభాయ్.. సెకండ్ పార్ట్‏కు మించి ఉంటుందని..

Pawan Kalyan: భవదీయుడు భగత్ సింగ్ డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్.. పవర్ ఫుల్‏గా ఉందంటూ మెగాస్టార్ కితాబు..