Avatar 2: క్రేజీ ఆప్డేట్ ఇచ్చిన జేమ్స్ కేమరూన్.. వైరల్ అవుతోన్న అవతార్ 2 టైటిల్..
హాలీవుడ్ సినిమాలకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడ్వాంచర్, యాక్షన్, ఫిక్షన్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉంటారు.
హాలీవుడ్ సినిమాలకు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అడ్వాంచర్, యాక్షన్, ఫిక్షన్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉంటారు. హాలీవుడ్ సినిమాలు వరల్డ్ వైడ్ గా భారీ హిట్స్‌ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి సంచలన విజయాలను సాధించిన సినిమాలల్లో అవతార్(Avatar) సినిమా మొదటి స్థానంలో ఉంది. జేమ్స్ కేమరూన్( James Cameron) డైరెక్షన్ లో వచ్చిన మొదటి వరల్డ్ సినిమా ఇది. ఇప్పటీకీ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ పదిలంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అవతార్ పార్ట్ 2 క్రేజీ గ్లింప్స్ ని భారీ స్థాయిలో స్పెషల్ ప్రీమియర్‌గా వేశారు.
ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందని అన్నది ఈ గ్లింప్స్ ద్వారా అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ వైరల్ అవుతుంది. ఈ సినిమా అండర్ వాటర్ లో ఉండనుందని మొదటినుంచి వార్తలు వినిపిస్తున్నాయి . అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. తాజాగా జేమ్స్ కేమరూన్ ఇచ్చిన అప్డేట్ తో ఆ వార్తలు వాస్తవమే అని తెలుస్తుంది. ఈ సినిమాకు “అవతార్ ది వే ఆఫ్ ది వాటర్” అనే టైటిల్ ని పెట్టినట్టుగా రివీల్ చేశారు. దాంతో ఈ టైటిల్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మే 6 న రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాను డిసెంబర్ 16న రిలీజ్ చేయనున్నారు. ‘అవతార్ ది వే ఆఫ్ ది వాటర్’ మొదటి పార్ట్ కు మించి ఉంటుందని చిత్రబృందం అంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :