Acharya: మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాకోసం ట్రెండ్ అయిన ఐదుగురు భామలు వీరే

ఆచార్య(Acharya)లో ఇద్దరు హీరోలైతే వాళ్లకు జోడీగా ఐదుగురు హీరోయిన్లు..! ఇలా మల్టిపుల్ గ్లామర్‌ డోస్‌తో తెగ ప్రమోట్ అవుతోంది మెగా ప్రిస్టీజియస్ మూవీ ఆచార్య.

Acharya: మెగాస్టార్ 'ఆచార్య' సినిమాకోసం ట్రెండ్ అయిన ఐదుగురు భామలు వీరే
Acharya
Follow us

|

Updated on: Apr 29, 2022 | 10:01 AM

ఆచార్య(Acharya)లో ఇద్దరు హీరోలైతే వాళ్లకు జోడీగా ఐదుగురు హీరోయిన్లు..! ఇలా మల్టిపుల్ గ్లామర్‌ డోస్‌తో తెగ ప్రమోట్ అవుతోంది మెగా ప్రిస్టీజియస్ మూవీ ఆచార్య. అదేమిటి.. ఐదుగురు హీరోయన్లు ఎక్కడున్నారు.. కాస్టింగ్‌లో ఆ ఇద్దరే కదా అని డౌట్ పడేవాళ్లు… ఒక్కసారి డెప్త్‌లోకెళ్లి ఆలోచిస్తే పిచ్చ క్లారిటీ దొరుకుతుంది. మెగా కాంపౌండ్‌లో ఆచార్య ప్రాజెక్ట్ కన్‌ఫమ్‌ కాగానే డైరెక్టర్ ముందున్నవి రెండే రెండు బిగ్ ఛాలెంజెస్. ఒకటి- సెకండ్ హీరోని సెట్‌ చేయడం.. రెండోది – చిరూకు జోడీని వెతుక్కోవడం. ఫస్ట్ ఛాయిస్ నువ్వే అంటూ త్రిషను అప్రోచ్ అయ్యారు మేకర్స్‌. కానీ.. క్రియేటివ్ డిఫరెన్సెస్‌ని సాకుగా చూపి ఆచార్య నుంచి వర్షం బ్యూటీ తప్పుకోగానే.. లాహెలాహె అంటూ చందమామ లైన్లోకొచ్చేశారు.

సినిమా ప్రమోషన్‌ టైమ్‌లో పేలిన బిగ్‌ బాంబ్ ఏంటంటే ఆచార్య సినిమాలో కాజల్‌కి నో స్పేస్. ఆమె స్టేచర్‌కి తగిన పాత్ర కాదనో, ఆచార్య లాంటి హుందాతనమున్న క్యారెక్టర్‌కి లవ్ కనెక్షన్ అతకదనో.. కారణం ఏదైతేనేం ఆచార్య ఆఖరి రౌండ్‌లో ఎలిమినేట్ అయ్యారు కాజల్. చాలా ఏళ్ల తర్వాత హీరోయిన్‌ లేకుండా చిరంజీవి సోలో సినిమా చూస్తున్నామని బాధ పడింది మెగాఫ్యాన్స్‌. కానీ వాళ్లను ఓదార్చడానికే అన్నట్టు విచిత్రంగా ఆచార్య ప్రాజెక్ట్‌లోకి స్వీటీ ఇన్‌క్లూడ్ అయ్యారు. ఆచార్యలో అనుష్క నటించారని.. చివరిదాకా దీన్నొక సర్‌ప్రైజ్‌గా మేకర్స్ దాచిపెట్టారని సోషల్ మీడియాలో రూమర్లు పుట్టేశాయి. ఇందులో వాస్తవం లేకపోయినా.. అరే.. నిజమేనా.. అనే ఎటెన్షన్‌నైతే గ్రాబ్ చేయగలిగింది ఆచార్య మూవీ. ఇక నాలుగో గ్లామర్‌ పాయింట్.. రెజీనా కసాండ్రా. సానా కష్టం నీతో మందాకినీ అంటూ చిరూతో చిందులేయించిన రెజీనా.. ఆచార్యకు స్పెషల్ ఎసెట్.

లాస్ట్.. బట్ నాట్ లీస్ట్.. బుట్టబొమ్మ పూజా హెగ్డే. చరణ్‌ చేసిన సిద్ధ పాత్రకు జోడీగా నీలాంబరిగా నటించిన పూజ.. ఆచార్యకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఆన్‌స్క్రీన్‌లో చెర్రీకి కంపానియన్‌గా నటిస్తే… ఆఫ్‌స్క్రీన్లో చిరూతో కలిసి మేజిక్ షురూ చేశారు పూజ. ప్రమోషన్‌లో పూజ అండ్‌ చిరూ మధ్య పండిన కెమిస్ట్రీ ఇప్పుడు స్వీట్ అండ్ హాట్‌టాపిక్. ఈ లెక్కన ఆచార్యకు బజ్‌ పెంచడానికి డైరెక్ట్‌గానో ఇన్‌డైరెక్ట్‌గానో ఐదుగురు హీరోయిన్లు తలోవిధంగా పాటుపడుతున్నారన్నమాట.

మరిన్ని ఇక్కడ చదవండి 

Hindi language Row: దేశవ్యాప్తంగా రాజుకంటున్న భాషా వివాదం.. పులుముకుంటున్న రాజకీయరంగు!

Richa Gangopadhyay : పెళ్లితర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి బ్యూటీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Nandamuri Balakrishna: నో గ్యాప్ అంటున్న నటసింహం.. స్పీడ్ పెంచిన బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీ బిజీ