Acharya Movie Review: ఆచార్య అంచనాల సంచలనాలను అందుకున్నాడా.? మెగా మూవీ ఎలా ఉందంటే..

ఒక సినిమా వస్తోంది అంటే అభిమానులకు పెద్ద పండగలా ఉంటుంది. అందులోనూ మెగాస్టార్ సినిమా అంటే ఇక చెప్పక్కర్లేదు. ఆ పండగ వాతావరణానికి హద్దు ఉండదు.

Acharya Movie Review: ఆచార్య అంచనాల సంచలనాలను అందుకున్నాడా.? మెగా మూవీ ఎలా ఉందంటే..
Acharya
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 29, 2022 | 12:13 PM

నటీనటులు: చిరంజీవి, రామ్ చరణ్, పూజాహెగ్డే, సోనూసూద్.

రచన – దర్శకత్వం: కొరటాల శివ

నిర్మాత: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్

సంగీతం: మణిశర్మ

విడుదల: ఏప్రిల్‌ 29, 2022

ఒక సినిమా వస్తోంది అంటే అభిమానులకు పెద్ద పండగలా ఉంటుంది. అందులోనూ మెగాస్టార్ సినిమా అంటే ఇక చెప్పక్కర్లేదు. ఆ పండగ వాతావరణానికి హద్దు ఉండదు. ఇక మెగాస్టార్ తో మెగా పవర్ స్టార్ ఉన్నారంటే అది అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు వీరిద్దరినీ ఒకే కథలో.. ఒకే సినిమాలో.. ఒకే తెరపై చూపించారు కొరటాల శివ. సామాజిక ఇతివృత్తాలతో హార్ట్ టచింగ్ సినిమాలు తీసిన అపజయం అంటే తెలీని కొరటాల.. మెగాస్టార్.. మెగా పవర్ స్టార్ ల మెగా కాంబినేషన్ పై అభిమాణుల్లోనే కాదు.. అందరిలోనూ చాలా పెద్ద ఆంచనాలున్నాయి. ఆ అంచనాల నడుమ అరుదైన కాంబినేషన్లో ‘ఆచార్య’ ఈరోజు(ఏప్రిల్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ లెక్కల్ని సినిమా రీచ్ అయిందా? సినిమా ఎలా ఉంది? చెప్పేసుకుందాం రండి

కథ: 

800 ఏళ్ల చ‌రిత్ర ఉన్న గ్రామం ధ‌ర్మ‌స్థ‌లి. ధర్మానికి ఆ గ్రామం ప్ర‌సిద్ధి. అక్క‌డ అధ‌ర్మం చోటు చేసుకున్న‌ప్పుడు అమ్మ‌వారే ఏదో రూపంలో వ‌చ్చి అక్కడివారిని కాపాడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అమ్మవారి పాదాల చెంత  ఓ చిన్న తండా ఉంటుంది. దానికి పాద‌ఘ‌ట్టం అని పేరు. ఆ పాద‌ఘ‌ట్టం, దానిప‌క్క‌న ఉన్న మరో గ్రామం సిద్ధ‌వ‌నంపై విలన్స్ కన్నుపడుతుంది. ధ‌ర్మ‌స్థ‌లిపై కూడా బ‌స‌వ (సోనూసూద్‌) ఆక్రమిస్తాడు. తనకు ఎదురుచెప్పిన వారిని చంపేస్తూ ఉంటాడు. పాద‌ఘ‌ట్టం జ‌నాల్ని, ధ‌ర్మ‌స్థ‌లిని కాపాడటానికి అక్కడికి కామ్రేడ్ ఆచార్య (మెగాస్టార్ చిరంజీవి)వ‌స్తాడు. ఇంతకు అక్కడికి చిరంజీవిని పంపించింది ఎవరు..? ధ‌ర్మ‌స్థ‌లిలోనే పెరిగిన సిద్ధ(రామ్‌చ‌ర‌ణ్) ఏమయ్యాడు.? సిద్దకు ఆచార్యకు సంబంధం ఏమిటి..? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

తన మార్క్ కథలతో అలరించిన కొరటాల శివ. ఆచార్య సినిమాలో మాత్రం ఎక్కువగా హీరోల వ్యాల్యూస్ కె ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. కథలో బలం లేకపోవడంతో సినిమా తేలిపోయిన అనుభూతి కనిపిస్తుంది. ఇక ఫస్ట్ ఆఫ్ కాస్త నెమ్మదిగా సాగిన సెకండ్ ఆఫ్ ఊపందుకుంటుంది. రామ్ చరణ్ ఎంట్రీ.. ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మణిశర్మ అందించిన సంగీతం అలరించింది.  చిరంజీవి కామ్రేడ్ ఆచార్య‌గా తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆయ‌న క‌నిపించిన విధానంతోపాటు ఫైట్స్ , డ్యాన్సుల‌తో అల‌రించారు. రామ్‌చ‌ర‌ణ్ సెకండ్ ఆఫ్  మొత్తం క‌నిపిస్తారు. వాళ్లిద్ద‌రివే బ‌ల‌మైన పాత్ర‌లు. సోనూసూద్‌, జిషూసేన్ గుప్తా విలన్స్ గా తమ పాత్రమేర నటించి ఆకట్టుకున్నారు. ఇక పూజ హెగ్డే  సిద్ధ‌ని ప్రేమించిన యువ‌తిగా కనిపించి ఆకట్టుకుంది. తిరు కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. ధ‌ర్మ‌స్థ‌లి నేప‌థ్యాన్ని ఆవిష్క‌రించిన తీరు చాలా అందంగా ఉంటుంది.

చివరిగా : గుణపాఠాలు నేర్పించే ‘ఆచార్య’ 

మరిన్ని ఇక్కడ చదవండి 

Hindi language Row: దేశవ్యాప్తంగా రాజుకంటున్న భాషా వివాదం.. పులుముకుంటున్న రాజకీయరంగు!

Richa Gangopadhyay : పెళ్లితర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి బ్యూటీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Nandamuri Balakrishna: నో గ్యాప్ అంటున్న నటసింహం.. స్పీడ్ పెంచిన బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీ బిజీ