AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits of Tulasi: సర్వరోగ నివారిణి మీ ఇంట్లోనే ఉంది.. ఏంటి నమ్మట్లేదా..? అయితే ఇది చదవండి..

దాదాపు అందరి ఇళ్లలో ఒక దివ్యౌషధం ఉంటుంది. అదే తులసి(Tulasi) చెట్టు.. ఈ చెట్టును భక్తితో పూజస్తారు కూడా. అయితే తులసి ఆకులు అన్ని రకాల రోగ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తాయి...

Health Benefits of Tulasi: సర్వరోగ నివారిణి మీ ఇంట్లోనే ఉంది.. ఏంటి నమ్మట్లేదా..? అయితే ఇది చదవండి..
Srinivas Chekkilla
|

Updated on: Apr 30, 2022 | 6:30 AM

Share

దాదాపు అందరి ఇళ్లలో ఒక దివ్యౌషధం ఉంటుంది. అదే తులసి(Tulasi) చెట్టు.. ఈ చెట్టును భక్తితో పూజస్తారు కూడా. అయితే తులసి ఆకులు అన్ని రకాల రోగ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తాయి. తులసిలో ఉండే ఫ్లావనాయిడ్‌లు, యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తులసిలో ఐరన్, విటమిన్(Vitamin A) ‘A’, విటమిన్ ‘C’, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోజు తులసి ఆకులను వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఎండబెట్టిన తులసి ఆకులను పొడిగా చేసి, దీనికి ఒక చెంచా ఆవాలు నూనె కలిపిన మిశ్రమాన్నినొప్పిగా ఉన్న దంతాల(Teeth)కు పూసి, రాత్రంతా అలానే ఉంచండి. మరుసటి నొప్పి తగ్గిపోతుంది. ఉడికించిన తులసి ఆకులను ఒక కప్పులో తీసుకొని, వీటికి తేనెను కలపి.. రాత్రి పడుకునే ముందుగా ఈ మిశ్రమాన్ని తాగొచ్చు. ఇది గురకను తగ్గిస్తుంది.

భోజనం తరువాత కొన్ని తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణప్రక్రియ బాగా జరుగుతుందట. తులసి టీని తాగటం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చట. మీరు తులసిని యాంటీ- డిప్రెషన్ ముందుగా కూడా కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజు రెండు సార్లు, 10-12 తులసి ఆకులను నమలటం వల్ల మెదడుకు కావలసిన ఆక్సిజన్ సరఫరాను సజావుగా జరుగుతుందట. ఎండలో ఎండబెట్టిన తులసి ఆకులను తీసుకొని రాత్రి నీటిలో నానబెట్టిన తింటే రక్తంలో చక్కెర స్థాయి అదువులో ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన వచ్చేవారు ఎండలో ఎండబెట్టిన తులసి ఆకులకు, ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలపండి. దీని మౌత్ వాష్ లాగా వాడండితే మంచి ఫలితం ఉంటుంది.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Read Also.. Mosquito Facts: అలాంటి వారంటే దోమలకు ఎంతో ఇష్టమంట.. వాటి బారి నుంచి తప్పించుకోండి ఇలా..