Telangana: “తెలంగాణలో ఫ్రెండ్స్ ఉంటే వాస్తవ పరిస్థితులు తెలిసేవి”.. కేటీఆర్ కామెంట్స్ పై షర్మిల ఫైర్

తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్(KTR) వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. పక్క రాష్ట్రంలో రోడ్లు, కరెంట్ వంటి సౌకర్యాలు సరిగా లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రా మంత్రులు స్పందిస్తున్నారు. తమ రాష్ట్రంపై అసత్య ఆరోపణలు...

Telangana: తెలంగాణలో ఫ్రెండ్స్ ఉంటే వాస్తవ పరిస్థితులు తెలిసేవి.. కేటీఆర్ కామెంట్స్ పై షర్మిల ఫైర్
Ktr And Ys Sharmila
Follow us

|

Updated on: Apr 30, 2022 | 2:42 PM

తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్(KTR) వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. పక్క రాష్ట్రంలో రోడ్లు, కరెంట్ వంటి సౌకర్యాలు సరిగా లేవని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రా మంత్రులు స్పందిస్తున్నారు. తమ రాష్ట్రంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని, కావాలంటే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు వచ్చి పరిస్థితిని స్వయంగా చూడాలన్నారు. మరోవైపు ఆంధ్రా మంత్రుల వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులూ కౌంటర్లు ఇస్తున్నారు. ఉన్నమాటే చెబితే ఎందుకంత ఉలుకని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేటీఆర్ కామెంట్లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు తెలంగాణలో ఫ్రెండ్స్ ఉంటే వాస్తవాలు తెలిసేవని ఎద్దేవా చేశారు. “చిన్న దొర కేటీఆర్ కు ఆంధ్రాలో ఫ్రెండ్స్ ఉన్నారట…ఇక్కడ ఎవరు లేరట.. తెలంగాణలో ఫ్రెండ్స్ ఉంటే మీ పరిపాలన ఎలా ఉందో అర్థం అయ్యేది” అని తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు..మంత్రి కేటీఆర్‌కు స్నేహితులు కాదా అని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్లు ఏమవుతారని తనదైన శైలిలో పంచ్‌లు పేల్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారు సైతం ఇప్పుడు బాధ పడుతున్నారని విమర్శించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో షర్మిల పాదయాత్ర చేపట్టిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్(KCR) ప్రభుత్వం పట్టించుకోవడం లేదని షర్మిల మండిపడ్డారు. వారికి ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తక్షణమే ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మ‌న‌మే స‌రిగ్గా లేన‌ప్పుడు ప‌క్క వారి మీద ప‌డి ఏడిస్తే ఏం లాభ‌మని విమర్శించారు. పక్క రాష్ట్రంపై దుమ్మెత్తిపోసే ముందు మన రాష్ట్రం ఎలా ఉందో చూసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజ‌లు సంతోషంగా ఉన్నారో, లేదో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Mana Uru Mana Badi: జూన్ 1 నుంచి బడి బాట.. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులుః మంత్రి సబితా

Viral Photo: ఈ ఫోటోలో దాగున్న అద్భుతం ఏంటో చెప్పగలరా.? 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు!