Fact Check: బొత్స కరెంట్ బిల్లులపై నెట్టింట్లో వైరలవుతోన్న ట్వీట్‌.. వివరణ ఇచ్చిన సీఎండీ..

ఏపీలో విద్యుత్ సరఫరా, నీళ్లు లేవని, రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి

Fact Check: బొత్స కరెంట్ బిల్లులపై నెట్టింట్లో వైరలవుతోన్న ట్వీట్‌.. వివరణ ఇచ్చిన సీఎండీ..
Botsa Satyanarayana
Follow us
Basha Shek

|

Updated on: May 01, 2022 | 9:40 AM

ఏపీలో విద్యుత్ సరఫరా, నీళ్లు లేవని, రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. వీటిపై ఇరు రాష్ట్రాల మంత్రుల కౌంటర్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాగా కేటీఆర్‌ వ్యాఖ్యలను ఏపీ విద్యా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కూడా ఖండించారు. హైదరాబాద్‌లో కూడా విద్యుత్ కోతలు ఉన్నాయని.. తాము జనరేటర్లు వేసుకుని ఉన్నామంటూ మంత్రి పేర్కొన్నారు. ఇక వీటికి కౌంటర్‌గా టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి బొత్స హైదరాబాద్‌లో కరెంట్ బిల్లు కట్టలేదేమో.. అందుకే కట్ చేసి ఉంటారని ఎద్దేవా చేశారు. ఈక్రమంలోనే నిన్నటి నుంచి బొత్సకు సంబంధించిన ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా హల్‌చల్‌ చేస్తోంది. ఏపీ మంత్రి హైదరాబాద్‌లోని తన నివాసానికి 15 నెలలుగా కరెంటు బిల్లులు చెల్లించలేదని, అందుకే విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ( TSSPDCL) తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నట్టుగా చెప్పే పోస్ట్‌ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

వారిపై కఠిన చర్యలు..

తాజాగా ఈ ట్వీట్‌పై డిస్కం సీఎండీ రఘుమారెడ్డి స్పందించారు. బొత్సకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ట్వీట్‌ బోగస్‌ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని విద్యుత్‌ పంపిణీ సంస్థ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయలేదని సీఎండీ స్పష్టం చేశారు. తమ సంస్థ పేరు మీద ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రఘురామిరెడ్డి హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Telangana Jobs: ఉద్యోగార్థులకు అలెర్ట్‌.. రేపటి నుంచి గ్రూప్‌-1 పోస్టుల దరఖాస్తుల స్వీకరణ.. ఎలా అప్లై చేయాలంటే..

Virat Kohli: కింగ్ కోహ్లీ అర్ధసెంచరీ.. గ్యాలరీలో అనుష్క సంబరాలు మాములుగా లేవుగా..

Viral Photo: బుంగమూతి పెట్టుకున్న ఈ బంతిపువ్వు ఎవరో తెలుసా..? కనిపెట్టడం అంత కష్టం కాదేమో..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!