Viral Video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే పడి పడి నవ్వాల్సిందే..

భానుడి ప్రభావంతో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Viral Video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే పడి పడి నవ్వాల్సిందే..
Follow us
Basha Shek

|

Updated on: May 01, 2022 | 12:41 PM

భానుడి ప్రభావంతో దేశమంతా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి చాలదన్నట్లు బొగ్గు కొరతతో చాలా రాష్ట్రాల్లో 2 నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ప్రజలు. ఈక్రమంలో కరెంట్ బాధలు, వేసవి వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈక్రమంలో చల్లదనం ఓ వ్యక్తి చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కరెంట్ పోయిందేమో పాపం ఆ వ్యక్తి తన చేతులతో ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్‌కు ఉండే రెక్కలను వీలైనంత గట్టిగా తిప్పి మంచంపై పడుకుంటాడు. ఫ్యాన్ ఆగిపోయిన తర్వాత లేచి మళ్లీ రెక్కలను తిప్పి మళ్లీ బెడ్‌పైకి వెళతాడు. విద్యుత్ సరఫరా వచ్చేంత వరకు అలాగే చేస్తుంటాడు.

ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ ..దీనికి సంబంధించిన వీడియోను ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నాడు. ఈనికి ‘ఈ టెక్నిక్ భారతదేశాన్ని దాటి బయటకు వెళ్లకూడదు’ అని సరదాగా క్యాప్షన్‌ జోడించారు. దీంతో ఈ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన వారందరూ తెగ నవ్వుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే త్వరలో  అందరూ ఇదే పనిచేయాల్సి వస్తుందమోనని నెటిజన్లు  విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  మరి ఈ ఫన్నీ వీడియోను చూసి మీరు కూడా సరదాగా నవ్వుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

A

IPL 2022: రెండు పరుగులకే రోహిత్‌ ఔట్‌.. నిరాశలో మునిగిపోయిన సతీమణి రితిక.. అశ్విన్‌ భార్య ఎలా ఓదార్చిందో మీరే చూడండి..

Viral News: ఈ 30 ఏళ్ల రియల్‌ విక్కీ డోనర్‌కి 50కి మందికి పైగా పిల్లలు.. కానీ దాంపత్య యోగమే దక్కడం లేదట..

Fact Check: బొత్స కరెంట్ బిల్లులపై నెట్టింట్లో వైరలవుతోన్న ట్వీట్‌.. వివరణ ఇచ్చిన సీఎండీ..