AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఈ 30 ఏళ్ల రియల్‌ విక్కీ డోనర్‌కి 50కి మందికి పైగా పిల్లలు.. కానీ దాంపత్య యోగమే దక్కడం లేదట..

ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కిన విక్కీ డోనర్ సినిమా చూశారా? లేకపోతే తెలుగులో సుమంత్‌ కథానాయకుడిగా వచ్చిన నరుడా డోనరుడా అనే మూవీ చూశారా?

Viral News: ఈ 30 ఏళ్ల రియల్‌ విక్కీ డోనర్‌కి 50కి మందికి పైగా పిల్లలు.. కానీ దాంపత్య యోగమే దక్కడం లేదట..
Kyle Cordy
Basha Shek
|

Updated on: May 01, 2022 | 10:45 AM

Share

ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కిన విక్కీ డోనర్ సినిమా చూశారా? లేకపోతే తెలుగులో సుమంత్‌ కథానాయకుడిగా వచ్చిన నరుడా డోనరుడా అనే మూవీ చూశారా? ఇందులో హీరోలు వీర్యదానం (Sperm Donation) చేస్తుంటారు. అది సినిమా. అయితే నిజజీవితంలోనూ ఓ విక్కీ డోనర్‌ ఉన్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కైల్ గోర్డీ (Kyle Cordy) అనే 30 ఏళ్ల యువకుడు వీర్యదానం ద్వారా ఇప్పటివరకు 47 మంది చిన్నారులకు బయలాజికల్‌ ఫాదర్‌గా తండ్రిగా నిలిచాడు. త్వరలోనే మరో 10 మంది చిన్నారులు కూడా ఈ లిస్టులో చేరనున్నారు. అయితే దురదృష్టవశాత్తూ కైల్‌కు ఇప్పటివరకు పెళ్లి కాలేదట. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలనుకున్న కోరిక ఉన్నప్పటికీ అతనితో కలిసి జీవితం పంచుకునేందుకు ఏ అమ్మాయీ ముందుకు రావడం లేదట. తాను ఉచితంగా స్పెర్మ్‌ దానం చేయడమే దీనికి కారణమని గోర్డీ వాపోతున్నాడు.

8 ఏళ్ల నుంచి..

‘నేను 22 ఏళ్ల వయసు నుంచి వీర్య దానం చేస్తున్నాను. గత ఎనిమిదేళ్లలో సుమారు 1000 మంది మహిళలు వీర్యం కోసం తనను సంప్రదించారు. నా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు మహిళల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని సందేశాలు రావడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. వీర్యం కోసం నా దగ్గరకు వచ్చే మహిళలందరూ బాగా ధనవంతులే. కావాలనుకుంటే వారు స్పెర్మ్‌ బ్యాంక్‌కు వెళ్లొచ్చు. అయితే వారు మాత్రం నా దగ్గరకు రావడానికి వివిధ కారణాలు చెబుతున్నారు. స్మెర్మ్‌ డోనర్‌గా కొనసాగాలన్న నిర్ణయంపై నాకెలాంటి విచారం లేదు. అయితే దీని కారణంగా వ్యక్తిగతంగా నా జీవితం చిక్కుల్లో పడింది. నన్ను పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయీ ఆసక్తి చూపించడం లేదు. కొంత మంది మహిళలు నాతో డేటింగ్‌కు ఆసక్తి చూపినా ఆ విషయమై ముందడుగు పడలేదు. ఒకవేళ ఎవరైనా మహిళ నా జీవితంలోకి రావాలనుకుంటే సంతోషంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు కైల్‌.

అమ్మాయి కోసం ఎదురుచూపులు..

కాగా ప్రస్తుతం వీర్య దానం కోసం వరల్డ్‌ టూర్‌ పర్యటనకు బయలు దేరాడీ రియల్‌ విక్కీ డోనర్‌. ఈ సందర్భంగా గత 8 ఏళ్లలో తన కారణంగా కలిగిన సంతానాన్ని కలుసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. ఈ ప్రపంచ పర్యటనలోనైనా తనకు తోడుగా నిలిచే అమ్మాయి తారసపడుతుందేమోనని అతను ఎదురుచూస్తున్నాడు. మరి కైల్‌ఆశలు ఫలిస్తాయో? లేదో? కాలమే సమాధానం చెప్పాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Manjima Mohan: మంజిమాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు.. తనదైన శైలిలో సమాధానమిచ్చిన మలయాళ ముద్దుగుమ్మ..

Telangana Jobs: ఉద్యోగార్థులకు అలెర్ట్‌.. రేపటి నుంచి గ్రూప్‌-1 పోస్టుల దరఖాస్తుల స్వీకరణ.. ఎలా అప్లై చేయాలంటే..

Virat Kohli: కింగ్ కోహ్లీ అర్ధసెంచరీ.. గ్యాలరీలో అనుష్క సంబరాలు మాములుగా లేవుగా..