Viral Video: భారీ అగ్నిప్రమాదం జరుగుతుంటే.. ఈ మహిళ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు
రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించారట..! ఇది సాధారణంగా అందరూ వాడే మాట..కానీ, ఇక్కడ మాత్రం సరిగ్గా అలాంటి సీనే జరిగింది. పక్కనే పెద్ద అగ్నిప్రమాదం జరుగుతుంటే..
Viral Video: రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించారట..! ఇది సాధారణంగా అందరూ వాడే మాట..కానీ, ఇక్కడ మాత్రం సరిగ్గా అలాంటి సీనే జరిగింది. పక్కనే పెద్ద అగ్నిప్రమాదం జరుగుతుంటే..ఇక్కడో మహిళ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఆ మహిళ చేసిన పని ఏంటో తెలుసా.. పెద్ద అగ్నిప్రమాదం జరుగుతుంటే ఓ మహిళ తాపీగా ఊయల ఊగుతోంది..దవానంలా మంటలు ఎగిసిపడుతుంటే..ఏమీ పట్టనట్టుగా ఒళ్లు చంటిబిడ్డతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే.
కోట్లాస్ పట్టణంలోని ఓ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఖరీదైన ఇళ్లన్నీ చూస్తుండగానే మంటల్లో కాలిపోతున్నాయి. ఆ మంటలు చుట్టుపక్కల ఇళ్లకు కూడా వ్యాపిస్తున్నాయి. మంటలదాటికి ప్రజలు హాహాకారాలు చేస్తూ అక్కడ్నుంచి పారిపోతున్నారు. రయ్‌రయ్ మంటూ ఫైర్ ఇంజిన్లు కూత పెడుతూ మంటలను అదుపుచేస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో పక్కనే ఉన్న పార్కులో ఓ మహిళ..తన బిడ్డను ఒళ్లో పెట్టుకొని.. ఎంతో తాపీగా, హాయిగా ఊయల ఊగుతోంది. ఆమె చుట్టూ ఉన్న వారంతా మంటలవైపు క్యాజువల్‌గా చూస్తున్నారు. ఆమె అలా ఊయల ఊగుతూ ఉండటం చూసిన ఓ వ్యక్తి ఆశ్చర్యపోయి.. వీడియో రికార్డ్ చేశారు. “ఓవైపు అంతలా మంటలు వ్యాపిస్తుంటే.. ఈమె ప్రశాంతంగా ఊయల ఊగుతోందేంటి?” అనుకుంటూ అతడు ఒకింత షాక్ అయ్యాడు. వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో అదికాస్త వైరల్ అవుతోంది. సదరు మహిళపట్ల నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :