Viral Video: బ్యాండ్ ట్యూన్‌కి అదరగొట్టే స్టెప్పులేసిన డాగీ.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..

Dog Dance Video: సోషల్ మీడియాలో ఎన్నో వినోదభరితమైన, ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి. ఇందులో కొన్ని వీడియోలు నవ్విస్తే, మరికొన్ని కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.

Viral Video: బ్యాండ్ ట్యూన్‌కి అదరగొట్టే స్టెప్పులేసిన డాగీ.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..
Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: May 01, 2022 | 7:20 AM

సోషల్ మీడియాలో ఎన్నో వినోదభరితమైన, ఫన్నీ(Funny) వీడియోలు కనిపిస్తాయి. ఇందులో కొన్ని వీడియోలు నవ్విస్తే, మరికొన్ని కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే, ఏ వీడియో ఎప్పుడు వైరల్(Viral) అవుతుందో ఊహించడం కష్టమే. కానీ, జంతువుల వీడియోలు మాత్రం ఎటువంటి సందేహం లేకుండా నెట్టింట్లో దూసుకపోతుంటాయి. అందుకే జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో అగ్రస్థానంలో దూసుకపోతుంటాయి. ఈ క్రమంలో పెంపుడు జంతువుల వీడియోలు కూడా ఉంటాయనడంలో సందేహం లేదు. తాజాగా, ఈ వీడియోల్లోకి మరో పెంపుడు జంతువు చేరింది. పెంపుడు కుక్క ఆనందానికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. వీడియోలో, డాగీ తన రెండు కాళ్లపై నిలబడి బ్యాండ్ ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు.

ఇందులో ఓ కుక్క తన యజమానితో సరదాగా గడుపుతోంది. తన వెనుక కాళ్ళపై నిలబడి కనిపిస్తుంది. ఆ తర్వాత తన ముందు వాయించే బ్యాండ్ ట్యూన్‌కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం, ఈ వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ట్విట్టర్‌లో 89 వేల మందికి పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో 6 వేల మందికి పైగా నెటిజన్లు దీన్ని లైక్ చేశారు. కొందరు నెటిజన్లు డాగీ డ్యాన్స్‌ని బెస్ట్‌గా అభివర్ణించగా, చాలా మంది యూజర్లు డాగీ డ్యాన్స్ విషయంలో చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Viral Video: ఓర్నీ దుంపతెగా..! సేమ్ రోబో సినిమానే.. రన్నింగ్‌ ట్రైన్‌పై బుడ్డోడు పరుగులు.. ట్రెండ్ అవుతున్న వీడియో..

Inspiring Video: ఊతకర్రతో బాలిక పరుగు పందెం.. డిప్యూటీ కలెక్టర్ మనసు దోచేసిన చిన్నారి