IPL 2022: రెండు పరుగులకే రోహిత్‌ ఔట్‌.. నిరాశలో మునిగిపోయిన సతీమణి రితిక.. అశ్విన్‌ భార్య ఎలా ఓదార్చిందో మీరే చూడండి..

RR vs MI: ఐపీఎల్‌ 2022లో ఎట్టకేలకు మొదటి విజయం రుచి చూసింది ముంబై ఇండియన్స్‌ జట్టు. శనివారం రాత్రి రాజస్తాన్‌ రాయల్స్‌ (RR Vs MI)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు పుట్టిన రోజు కానుకగా అందించింది.

IPL 2022: రెండు పరుగులకే రోహిత్‌ ఔట్‌.. నిరాశలో మునిగిపోయిన సతీమణి రితిక.. అశ్విన్‌ భార్య ఎలా ఓదార్చిందో మీరే చూడండి..
Ipl 2022
Follow us
Basha Shek

|

Updated on: May 01, 2022 | 12:01 PM

RR vs MI: ఐపీఎల్‌ 2022లో ఎట్టకేలకు మొదటి విజయం రుచి చూసింది ముంబై ఇండియన్స్‌ జట్టు. శనివారం రాత్రి రాజస్తాన్‌ రాయల్స్‌ (RR Vs MI)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు పుట్టిన రోజు కానుకగా అందించింది. అయితే జట్టు విజయం సాధించినప్పటికీ వ్యక్తిగతంగా బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు హిట్‌మ్యాన్‌. రాజస్థాన్‌ విధించిన159 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై మూడో ఓవర్లోనే రోహిత్ శర్మ వికెట్‌ కోల్పోయింది. 5 బంతులు ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్‌ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో బర్త్‌ డే రోజైనా భారీ ఇన్నింగ్స్‌తో అలరిస్తాడనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఫ్యాన్సే కాదు రోహిత్ ఔటవ్డం చూసి డగౌట్‌లో కూర్చున్న రోహిత్‌ ​సతీమణి రితికా శర్మ కూడా ఎంతో నిరాశకు గురైంది. దాదాపు ఏడ్చినంత పనిచేసింది. కాగా మరోవైపు రోహిత్‌ వికెట్‌ తీశానన్న ఆనందంతో అశ్విన్‌ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇది చూసిన అశ్విన్‌ భార్య ప్రీతి కూడా చప్పట్లు కొడుతూ భర్తను అభినందించింది. అయితే పక్కనే ఉన్న రితికా బాధపడడం చూసిన ఆమె పరిస్థితి అర్థం చేసుకుంది. వెంటనే రితక దగ్గరకు వచ్చి ప్రేమతో హత్తుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఐపీఎల్‌15 సీజన్‌లో వరుసగా ఎనిమిది పరాజయాలు ఎదుర్కొంది ముంబై జట్టు. అయితే ఎట్టకేలకు తొమ్మిదో మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో బోణి కొట్టింది. ముందుగా రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు సాధించింది. సూర్యకుమార్‌ (39 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించి ముంబై జట్టుకు మొదటి విజయం అందించాడు. తిలక్‌ వర్మ (30 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో కాస్త ఉత్కంఠ రేగినా టిమ్‌ డేవిడ్‌ (9 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా పరుగులు చేసి ముంబైకు మొదటి విజయాన్ని ఖరారు చేశాడు.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral News: ఈ 30 ఏళ్ల రియల్‌ విక్కీ డోనర్‌కి 50కి మందికి పైగా పిల్లలు.. కానీ దాంపత్య యోగమే దక్కడం లేదట..

Manjima Mohan: మంజిమాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు.. తనదైన శైలిలో సమాధానమిచ్చిన మలయాళ ముద్దుగుమ్మ..

Fact Check: బొత్స కరెంట్ బిల్లులపై నెట్టింట్లో వైరలవుతోన్న ట్వీట్‌.. వివరణ ఇచ్చిన సీఎండీ..