AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లక్ అంటే వీడిదే గురూ..! డ్రైవర్ ధైర్యానికి ఫిదా అవుతున్న నెటిజనం.. షాకింగ్ వీడియో

Car stuck in river: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా.. నీటిలో చిక్కుకొని బయటపడిన కారుకు

Viral Video: లక్ అంటే వీడిదే గురూ..! డ్రైవర్ ధైర్యానికి ఫిదా అవుతున్న నెటిజనం.. షాకింగ్ వీడియో
Viral News
Shaik Madar Saheb
|

Updated on: May 01, 2022 | 12:29 PM

Share

Car stuck in river: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా.. నీటిలో చిక్కుకొని బయటపడిన కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా అందమైన ప్రదేశాల్లో ప్రయాణం, ప్రకృతిలో విహరించడం అందరికీ ఇష్టమే. ఇలాంటి సమయంలో కొందరు ఇబ్బందుల్లో చిక్కుకుంటుంటారు. కొందరు ప్రాణాలు కూడా పొగొట్టుకుంటుంటారు. సాధారణంగా నీటి ప్రవాహం ఉన్న ప్రదేశాలలో తరచూ ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులకు సహాయం అందించడానికి NDRF బృందం లేదా సైన్యం రంగంలోకి దిగుతుంది. ఇలాంటి వాటికి సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా.. ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది.. ఇది చూస్తే రోమాలు నిక్కపొడుస్తాయి. వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.

వాస్తవానికి నది ప్రవాహంలో ఒక కారు చిక్కుకుపోయింది. అయితే డ్రైవర్ తన అవగాహన, సామర్ధ్యంతో తనను తాను ఇబ్బందుల నుంచి తృటిలో తప్పించుకోగలిగాడు. అందుకే మనిషి తనను తాను నమ్ముకుని లక్ష్యం వైపు పయనిస్తూనే ఉంటే.. విజయం వరిస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ వీడియోలో నది ప్రవాహం వేగంగా పెరుగుతుండటం, మరోవైపు ప్రవాహానికి తోడుగా ఓ కారు వేగంగా దూసుకురావడం కూడా వీడియోలో చూడవచ్చు. డ్రైవర్ ధైర్యంతో తన లక్ష్యం వైపు వేగంగా కదులుతూ.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడతాడు.

వైరల్ వీడియో చూడండి..

ఈ షాకింగ్ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘ఎవరు తనపై నమ్మకం కలిగి ఉంటారో, అతను ప్రతి కష్టం నుండి బయటపడగలడు’ అంటూ క్యాప్షన్‌ కూడా రాశారు. కేవలం 26 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 77 వేలకు పైగా వీక్షించగా.. 5 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Kissing Flowers: ఇవి ముద్దిచ్చే అదరాలు అనుకుంటే పొరపాటే.. ఫోటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే

Viral Video: అభినవ పరమానందయ్య శిష్యుడు.. వీడేనయా.! వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌