Viral Video: అభినవ పరమానందయ్య శిష్యుడు.. వీడేనయా.! వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..
Man Funny Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అయితే..
Man Funny Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అయితే.. కొన్ని వీడియోలు చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. కొందరు ట్రెండ్ అవ్వాలని వీడియోలు చేస్తుంటారు. మరికొందరు తెలియకుండానే వైరల్ అవుతుంటారు. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన సంబంధించిన ఫన్నీ వీడియో (Social Media) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు అందరూ తెగ నవ్వుకుంటున్నారు. వాస్తవానికి.. తనిఖీ జరిపే ప్రాంతానికి సంబంధించిన CCTV ఫుటేజ్ ఇది. అయితే.. ఇలాంటి భద్రతా తనిఖీ ఇంతకు ముందెన్నడూ చూడలేదంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. అసలు సెక్యూరిటీ చెకింగ్‌లో జరిగిన విషయం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి భద్రతా తనిఖీ ద్వారా అతను వెళ్ళవలసిన కార్యాలయంలోకి ప్రవేశించడాన్ని చూడవచ్చు. అయితే.. అతను ప్రవేశించిన వెంటనే సెక్యూరిటీ గార్డు ఆ వ్యక్తిని తన బ్యాగ్‌ను స్కానర్‌లో వేయాలని తిరిగి వెనక్కి పంపాడు. అయితే.. దానిని స్కానర్‌లో ఉంచాలి. కానీ.. ఆ వ్యక్తి డైరెక్ట్‌గా స్కానర్ మీదకు వెక్కి లోపల నుంచి వస్తాడు. స్కానర్‌లో సామానుతో పాటు, ఈ వ్యక్తి స్వయంగా కూర్చొని ముందుకు రావడాన్ని చూడవచ్చు. అయితే.. ఆ వ్యక్తి బయటకు రాగానే సెక్యూరిటీ గార్డు అతన్ని చూసి షాక్ అవుతాడు. తలపై రెండు చేతులు పెట్టుకుని ఇదేంటి రా..? నాయనా అనుకుంటూ ఆశ్చర్యపోతాడు. సెక్యూరిటీ గార్డు ఎక్స్‌ప్రెషన్ చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు. దీన్ని చూసి నవ్వు ఆగడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియో..
— Figen (@TheFigen) April 29, 2022
సోషల్ మీడియాలో ఈ ఫన్నీ వీడియో చూసిన జనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఈ ఫన్నీ వీడియోను ‘ఫిగెన్’ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి చాలా ఫన్నీ రియాక్షన్స్ వస్తున్నాయి. దీంతోపాటు యూజర్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: