Kissing Flowers: ఇవి ముద్దిచ్చే అదరాలు అనుకుంటే పొరపాటే.. ఫోటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే

సాధారణంగా ఏ పూలు అయినా.. గుండ్రంగానే ఉంటాయి…కానీ అమ్మాయి ముద్దు పెట్టినట్లు ఉండే పూలను మీరు ఎప్పుడైనా చూశారా.. ఎర్రటి పేదాలు ముద్దు పెడితే.. ఎలా ఉంటుందో..ఆ ఆకారంలో..ఈ పూలు ఉంటాయి.

Kissing Flowers: ఇవి ముద్దిచ్చే అదరాలు అనుకుంటే పొరపాటే.. ఫోటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే
Follow us
Rajeev Rayala

|

Updated on: May 01, 2022 | 12:19 PM

సాధారణంగా ఏ పూలు అయినా.. గుండ్రంగానే ఉంటాయి…కానీ అమ్మాయి ముద్దు పెట్టినట్లు ఉండే పూలను మీరు ఎప్పుడైనా చూశారా.. ఎర్రటి పేదాలు ముద్దు పెడితే.. ఎలా ఉంటుందో..ఆ ఆకారంలో..ఈ పూలు ఉంటాయి. అందుకేవీటిని అమ్మాయి ముద్దులతో పోలుస్తారు. పాలికోరియా ఎలాటా లేదా సైకోట్రియా ఎలాటా అని వీటి సైటిఫిక్‌ నేమ్‌..ఈ పూల స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

1

ఈ ఎర్రటి పెదవుల పూలకు జీవితకాలం చాలా తక్కువేనట. ఈ పెదవుల మధ్యలోంచీ తెల్లటి పూలు వస్తాయి. అవి వచ్చాక పెదవులు రాలిపోతాయి. ఆ తర్వాత కోడిగుడ్డు ఆకారంలోని బెర్రీస్ కాస్తాయి. అవి మొదట గ్రీన్ కలర్‌లో తర్వాత బ్లూ లేదా బ్లాక్ కలర్ లోకి మారుతాయి. ఈ సైకోట్రియా మొక్కల్లో 2000 రకాల జాతులున్నాయి. ఇవన్నీ పూల మొక్కలే. ఈ తరహా మొక్కలు మత్తు కలిగించే రసాయనాల్ని ఉత్పత్తి చేస్తాయి. డైమెతిల్‌ట్రిప్టామైన్ అనే రసాయనాన్ని ఇవి విడుదల చేస్తాయి. ఈ కెమికల్‌ని అమెరికా, యూరప్ దేశాల్లో దైవ సంబంధ కార్యక్రమాలకూ, మందుల తయారీలో వాడుతారు. ఈ మొక్కల ఆకులు, బెరడును గుజ్జుగా చేసి చర్మానికి రాసుకుంటే.. దద్దుర్లు తగ్గుతాయి. దగ్గు, ఆస్తమా వంటి వాటికి కూడా ఇది పనిచేస్తుందని చెబుతున్నారు.

2

ఈ పూల మొక్కలు ఎక్కడబడితే అక్కడ పెరగవు. వీటికి కచ్చితమైన వాతావరణం అవసరం. ఎక్కువ వేడి ఉండకూడదు.. అలా అని బాగా కూల్ గా కూడా ఉండకూడదు.. కొంత వెచ్చగా, కొంత ఉక్కగా, కొంత తేమతో కూడిన వాతావరణం ఉండాలి. నీడలో ఇవి బాగా పెరుగుతాయి. ఎండలో అయితే ఊరికే.. ఈ మొక్కలు దెబ్బతింటాయి. ఈ మొక్కలు ఎక్కువగా దక్షిణ అమెరికా వర్షాధారిత అమెజాన్ అడవుల్లో పెరుగుతాయి. ఈక్వెడార్, కోస్టారికా, పనామా, కొలంబియాలో వాతావరణం వీటికి సెట్ అవుతుంది. ప్రేమికుల రోజు న లవర్స్ గులాబీ పూలు ఇచ్చుకుంటారు. మధ్య అమెరికా ప్రజలు మాత్రం పూలతో ఉన్న ఈ మొక్కలను గిఫ్టుగా ఇస్తారు. కొంతమంది తమ ఫ్రెండ్స్‌కి కూడా వీటిని గిఫ్టుగా ఇస్తారు. ప్రస్తుతం అడవుల్ని నరికేస్తుంటే.. ఈ మొక్కల సంఖ్య తగ్గిపోతోంది. అందువల్ల ఇవి అరుదైన మొక్కల జాబితాలో చేరిపోయాయి.

3

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: బాల్కనీలో దుస్తులు ఆరేస్తే రూ. 20వేల జరిమానా.. ఎక్కడో తెలుసా?

Viral Video: బ్యాండ్ ట్యూన్‌కి అదరగొట్టే స్టెప్పులేసిన డాగీ.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే..

HBD Ajith Kumar: ఆ స్పెషల్ ఉంగరమంటేనే ఇష్టమంటోన్న అజిత్.. మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..