Prabhas: ఇదీ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్, బెంగాల్ టైగర్‌కు డార్లింగ్ పేరు..
Prabhas: ప్రభాస్ ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా ఓ సంచలనం. ఏమంటూ బాహుబలి (Bahubali) సినిమాలో నటించారో కానీ ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ నుంచి ఓ సినిమా వస్తుందంటే...
Prabhas: ప్రభాస్ ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా ఓ సంచలనం. ఏమంటూ బాహుబలి (Bahubali) సినిమాలో నటించారో కానీ ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అది నేషనల్ న్యూస్‌గా మారిపోతోంది. ప్రభాస్ డేట్స్ కోసం బాలీవుడ్ దర్శకులు సైతం ఎగబడుతున్నారంటే, డార్లింగ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ (Radheshyam) మాస్ ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిందని అభిప్రాయాలు వ్యక్తమైనా.. ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు కదా మరింత పెరిగింది. దీనికి నిదర్శనమే తాజాగా హైదరాబాద్‌లోని నెహ్రు జూలాజికల్ పార్క్ అధికారులు తీసుకున్న నిర్ణయం.
వివరాల్లోకి వెళితే.. జూపార్క్ అధికారులు బెంగాల్ టైగర్‌కు ప్రభాస్ పేరు పట్టారు. సాధారణంగా సినిమాల్లో హీరోలను పులి, సింహంతో పోలుస్తుంటారు. అయితే జూ నిర్వాహకులు ఏకంగా పులికే ప్రభాస్ పేరు పెట్టడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తుమ్మల రచనా చౌదరీ అనే మహిళ దత్తత తీసుకున్న బెంగాల్ టైగార్‌కు బ్రాకెట్లో ప్రభాస్ అని రాసున్న పోస్టర్‌ను సదరు టైగర్ ఉన్న చోట ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్‌కు సంబంధించిన ఫొటో నెట్టిటంట వైరల్ అవుతోంది. అయితే ఇలా జంతువులకు మనుషుల పేర్లు పెట్టడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ పార్క్‌లో కొన్ని జంతువులకు వ్యక్తుల పేర్లను నామకరణం చేసిన సంఘటనలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడీ వార్త నెట్టింట సందడి చేస్తోంది.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆదిపురుష్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న యంగ్ రెబల్ స్టార్. నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, సందీప్ వంగతో స్పిరిట్, మారుతి దర్శకత్వంలో ఇలా చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తలకు క్లిక్ చేయండి..
Also Read: Joe Biden: రష్యా అభివృద్ధిని అడ్డుకునేందుకు బైడెన్ సరికొత్త ప్లాన్.. సక్సెస్ అవుతుందా..!
Aunty dance: ఆంటీనా మాజాకా.! మందేసి చిందేస్తూ నాగిని డాన్స్‌తో రెచ్చిపోయిన ఆంటీ..