Joe Biden: రష్యా అభివృద్ధిని అడ్డుకునేందుకు బైడెన్ సరికొత్త ప్లాన్.. సక్సెస్ అవుతుందా..!

Joe Biden: రష్యా అభివృద్ధిని అడ్డుకునేందుకు బైడెన్ సరికొత్త ప్లాన్.. సక్సెస్ అవుతుందా..!
Joe Biden

Joe Biden: సాంకేతకత, ఆవిష్కరణలతో అమెరికాకు రష్యా కొరకరాని కొయ్యగా మారింది. దీనిని ఎలాగైనా ఎదురుకోవాలని నిర్ణయించుకున్న బైడెన్ సర్కార్ అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టింది. మాస్టర్ ప్లాన్ తో ముందుకొస్తోంది.

Ayyappa Mamidi

|

May 01, 2022 | 8:46 PM

Joe Biden: రష్యా నుంచి మేధో వలసలను(Brain Drain) వేగవంత చేసేందుకు యూఎస్ ప్రయత్నాలు మెుదలు పెట్టింది. ఉన్నత విద్యావంతులైన రష్యన్ పౌరులకు ఇందుకోసం కొన్ని వీసా నిబంధనలను(Visa Rules) రద్దు చేయాలని US యోచిస్తోంది. బైడెన్ ప్రభుత్వం యూఎస్ కాంగ్రెస్‌కు ఈ విషయంలో ఒక ప్రతిపాదన చేసింది. అమెరికా వెళ్లేందుకు రష్యన్ శాస్త్రవేత్తలు వీసా పొందాలంటే.. USలో స్పాన్సర్ చేసే యజమాని కలిగి ఉండాలనే నిబంధనను తొలగించాలని బైడెన్ ప్రతిపాదించారు. ఈ నిబంధన తొలగింపు కేవలం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి రంగాల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా డాక్టరేట్ ఉన్న రష్యా పౌరులకు మాత్రమే వర్తించనుంది. దీనివల్ల రష్యా నుంచి మేధో వసలు పెరుగుతాయని అమెరికా భావిస్తోంది.

అధికారుల నివేదిక ప్రకారం.. సెమీకండక్టర్స్, స్పేస్ టెక్నాలజీ, సైబర్‌సెక్యూరిటీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూక్లియర్ ఇంజనీరింగ్ లేదా క్వాంటం ఫిజిక్స్‌లో నైపుణ్యం ఉన్న వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. దీనివల్ల రష్యాకు ఖర్చు నష్టం కలగటంతో పాటు అమెరికాకు లాభదాయకంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ప్రముఖ జర్మన్ శాస్త్రవేత్తలు మరింత ఆకర్షణీయమైన లేదా స్థిరమైన అవకాశాల కోసం అమెరికాకు వెళ్లిపోయారు. US జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. బైడెన్ తాజా చర్య కారణంగా రానున్న కాలంలో పుతిన్ కు ఉన్న హైటెక్ వనరులను బలహీనపడతాయని, దీర్ఘకాలంలో రష్యా ఇన్నోవేషన్ బేస్ తగ్గిపోతుందని అన్నారు.

ప్రతి సంవత్సరం సగటున.. 1,800 మంది రష్యన్లు మహమ్మారికి ముందు శాశ్వత నివాస హోదాను పొందారు. యజమాని స్పాన్సర్‌లను కలిగి ఉన్న.. అత్యుత్తమ ప్రొఫెసర్లు, పరిశోధకులు, అడ్వాన్స్డ్ డిగ్రీలు కలిగిన నిపుణుల కోసం కేటాయించిన ఇమ్మిగ్రేషన్ వర్గీకరణల ఆధారంగా వలసల వివరాలు ఇలా ఉన్నాయి. అయితే.. ఇటువంటి వీసాల్లో ఎక్కువ భాగం భారతీయులకు జారీ చేయబడుతున్నాయి. ఏదేమైనా రష్యా వద్ద ఉన్న మేధావులను తమ దేశానికి వచ్చేందుకు మార్గం సుగమం చేయటం ద్వారా ఆ దేశాన్ని పరోక్షంగా దెబ్బతీయవచ్చని బైడెన్ మాస్టర్ ప్లాన్ వేశారు. అమెరికా సూపర్ పవర్ గా కొనసాగాలంటే.. రష్యా దూకుడుకు కళ్లెం వేయాలని భావించిన యూఎస్ తాజాగా వీసా నిబంధనలను సరళీకరించాలని నిర్ణయించింది.

ఇవీ చదవండి..

Dining Out: సరదాగా బయట తినాలంటే బిల్లు’ వర్రీనా? ఇలా చేస్తే ‘నో టెన్షన్

Gmail Security: జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని అనుమానమా.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu