AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie: ప్రేక్షకుల కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్‌ సిద్ధం చేసిన ఎఫ్‌3 టీమ్‌.. పేలనున్న ఫన్‌ బాంబ్‌..

F3 Movie: వెంకటేష్‌ (Venkateh), వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్‌-2 చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుల్‌లెంత్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు నవ్వుల వర్షంతో పాటు...

F3 Movie: ప్రేక్షకుల కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్‌ సిద్ధం చేసిన ఎఫ్‌3 టీమ్‌.. పేలనున్న ఫన్‌ బాంబ్‌..
F3 Movie
Narender Vaitla
|

Updated on: May 01, 2022 | 4:59 PM

Share

F3 Movie: వెంకటేష్‌ (Venkateh), వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్‌-2 చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుల్‌లెంత్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు నవ్వుల వర్షంతో పాటు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా అనూహ్య విజయం అందుకోవడంతో దర్శకుడు అనిల్‌ సీక్వెల్‌ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే.

ఎఫ్‌-3 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత కొన్ని పెద్ద సినిమాల విడుదల నేపథ్యంలోనూ వెనుకడుగు వేసింది. అయితే ఎట్టకేలకు మే 27న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీ దగ్గరపడుతోన్న క్రమంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా సోమవారం (మే 2) రోజున సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఫన్‌ బాంబ్‌ పేలడానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం 10.08 గంటలకు పేలుతుంది’ అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ చిత్ర యూనిట్‌ ఇవ్వనున్న సర్‌ప్రైజ్‌ ఎంటన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయితే సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. మరి ఎఫ్‌3 నుంచి రాబోయే ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Weight Loss Tips: ఊబకాయంతో బాధపడుతున్నారా..? ఈ కూరగాయలను తింటే బరువు తగ్గొచ్చు..

Kissing Flowers: ఇవి ముద్దిచ్చే అదరాలు అనుకుంటే పొరపాటే.. ఫోటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే

Kissing Flowers: ఇవి ముద్దిచ్చే అదరాలు అనుకుంటే పొరపాటే.. ఫోటోలు చూస్తే మైమరిచిపోవాల్సిందే