Weight Loss Tips: ఊబకాయంతో బాధపడుతున్నారా..? ఈ కూరగాయలను తింటే బరువు తగ్గొచ్చు..

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గడానికి పలు రకాల డైట్లు పాటిస్తుంటారు.

Weight Loss Tips: ఊబకాయంతో బాధపడుతున్నారా..? ఈ కూరగాయలను తింటే బరువు తగ్గొచ్చు..
Weight Loss Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 01, 2022 | 1:48 PM

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గడానికి పలు రకాల డైట్లు పాటిస్తుంటారు. సాధారణంగా పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును వదిలించుకోవడం అంత సులభం కాదు. ఊబకాయం కారణంగా భారతదేశంలోనే కాదు.. మొత్తం ప్రపంచ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మన దేశంలో కూడా ఊబకాయం బారిన పడే వారి సంక్య క్రమంగా పెరుగుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు పలు రకాల ఆహారాలను తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గించడంలో సహాయపడే ఆ కూరగాయలు ఏవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి తినవలసిన కూరగాయలు..

గుమ్మడికాయ : గుమ్మడి చాలా ఆరోగ్యకరమైన కూరగాయ. ఇది బరువు తగ్గించే ఆహారంగా పరిగణిస్తారు. ఎందుకంటే గుమ్మడికాయ తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు పొట్ట కొవ్వు కూడా త్వరగా కరుగుతుంది.

బీన్స్: బీన్స్‌లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి మంచి పోషణను అందించి బరువు తగ్గడంలో సహాయపడతాయి. దీని వల్ల కండరాల ఎదుగుదల బాగా జరిగి జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

టమాట: టమాట మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్ జీవక్రియను మరింత పెంచుతుంది. అదనంగా 9-oxo-ODA సమ్మేళనం రక్తంలో లిపిడ్లను తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.

కీర దోసకాయ: దోసకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. ఇది కడుపు, మొత్తం శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తింటే బరువు తగ్గి శరీరం మంచి ఆకారంలోకి వస్తుంది.

ఆకుకూరలు: పచ్చి ఆకు కూరలన్నీ ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. కొవ్వును కరిగించే శక్తి పాలకూర, బచ్చలికూర లాంటి వాటికి ఉన్నాయి. అయితే.. వీటిని ఎక్కువ నూనెలో వండకుండా.. ఉంటే ఈ పోషకాలు శరీరానికి అందుతాయి.

బ్రొకోలి: బ్రొకోలిని పోషకాల నిధిగా పేర్కొంటారు. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్ కాకుండా ఫైటోకెమికల్స్ కూడా ఉన్నాయి. ఇవి బొడ్డు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. దీన్ని సలాడ్‌గా ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Water Expiry Date: నీటికి కూడా గడువు ముగుస్తుందా..? ఎక్స్‌పెరి డేట్ ఎందుకు రాస్తారు.. అసలు విషయం ఇదే..

Weight Loss Drink: ఈ నీళ్లు తాగితే.. ఎంత బరువున్నా ఇట్టే తగ్గిపోతారు.. ఊబకాయానికి చక్కటి చిట్కా..