Weight Loss Drink: ఈ నీళ్లు తాగితే.. ఎంత బరువున్నా ఇట్టే తగ్గిపోతారు.. ఊబకాయానికి చక్కటి చిట్కా..

Benefits Of Fennel Seeds Water: మన ఇంటి వంటగదిలో పలు వ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉంటాయి. ముఖం కాంతివంతంగా ఉండాలన్నా, గాయానికి ఆయింట్ మెంట్ రాసుకోవాలన్నా,

Weight Loss Drink: ఈ నీళ్లు తాగితే.. ఎంత బరువున్నా ఇట్టే తగ్గిపోతారు.. ఊబకాయానికి చక్కటి చిట్కా..
Fennel Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 01, 2022 | 7:18 AM

Benefits Of Fennel Seeds Water: మన ఇంటి వంటగదిలో పలు వ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉంటాయి. ముఖం కాంతివంతంగా ఉండాలన్నా, గాయానికి ఆయింట్ మెంట్ రాసుకోవాలన్నా, నాలుక రుచి మార్చాలన్నా.. ఇందుకు మన వంటగది పూర్తి సహకారం అందిస్తోంది. ఈ మ్యాజికల్ కిచెన్ పరిష్కరించే మరొక సమస్య ఏమిటంటే పెరుగుతున్న బరువును నియంత్రించి.. తగ్గిస్తుంది. వాస్తవానికి వంటగదిలో ఉండే మసాలా దినుసులలో ఒకటైన సోంపు (Saunf Water) మీ ఊబకాయాన్ని తగ్గించే పనిని సులభంగా చేయగలదు. ఇదేకాకుండా, పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కావున బరువు తగ్గేందుకు సోపును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి, ఇనుము, మాంగనీస్, సెలీనియం, జింక్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సోపులో పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి పని చేస్తాయి. దీని నీరు మీ బరువును తగ్గించడమే కాకుండా కడుపు సంబంధిత సమస్యలైన ఎసిడిటీ, కడుపు నొప్పి, మలబద్ధకం, పీరియడ్స్ క్రాంప్‌ల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. రోజూ నీళ్లలో సోపు కలుపుకుని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

సోపు నీటిని ఎలా తయారు చేయాలి..

ఒక చెంచా సోపు గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయం ఫ్రెష్ అయిన తర్వాత ఈ నీటిని తాగండి. కావాలంటే వడపోసి తాగొచ్చు. ఇలా రోజూ చేస్తే పెరిగే పొట్ట తగ్గడం ఖాయం. దీంతోపాటు ఈ గింజలను నీటిలో వేసి మరగించి కూడా తాగవచ్చు.

ఇతర ప్రయోజనాలు..

ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కఫం సమస్య కూడా తొలగిపోతుంది. ఇది కాకుండా.. ఆస్తమా ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా సహాయపడుతుంది. అదే సమయంలో కొలెస్ట్రాల్ రోగులకు, నరాల సంబంధిత సమస్యలలో బాధపడుతున్నవారిని ఉపశమనం కలిగిస్తుంది. పాలిచ్చే తల్లులు కూడా ఫెన్నెల్ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఇథనాల్ అనే మూలకం ఉంటుంది.. ఇది పాలు ఏర్పడే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది రొమ్ము వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సోంపు తినడం ద్వారా నోటి నుంచి వెలువడే దుర్వాసనను చెక్ పెట్టవచ్చు. దీంతోపాటు ఇది ఆహారాన్ని కూడా త్వరగా జీర్ణం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Health Tips: రక్తహీనతతో బాధపడుతున్నారా.. వెంటనే, ఈ 4 జ్యూస్‌లు తాగితే సరి..

Health Tips: సరైన నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది.. అసలు ఎవరు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసా?