Health Tips: సరైన నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది.. అసలు ఎవరు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసా?

మంచి ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో, ఆరోగ్యకరమైన శరీరానికి నిద్ర కూడా చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు, వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Health Tips: సరైన నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది.. అసలు ఎవరు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసా?
sleep
Follow us
Venkata Chari

|

Updated on: May 01, 2022 | 6:00 AM

ఆరోగ్యకరమైన(Health) శరీరం, మనస్సు కోసం మంచి నిద్ర అవసరం. తగినంత నిద్ర లేకపోవడం టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు(Heart), ఊబకాయం(Weight), డిప్రెషన్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. బిజీ షెడ్యూల్ వల్ల రాత్రి ఆలస్యంగా నిద్రపోయి తెల్లవారుజామున లేచేవాళ్లు చాలామందే ఉన్నారు. ఎత బిజీగా ఉన్నాసరే.. నిద్రపోయేందుకు పక్కగా ప్లాన్ చేసుకుని తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇటువంటి పరిస్థితిలో, ఏ వయస్సు వారికి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర ఎందుకు అవసరం?

నిద్ర పోవడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. రాత్రిపూట నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట నిద్రలేమితోపాటు అలసట, మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పాటు అనేక రకాల వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అన్ని వయసుల వారికి నిద్ర చాలా అవసరం.

పిల్లలకు తగినంత నిద్రలేకపోతే ఏం జరుగుతుంది?

మంచి నిద్ర లేకపోవడం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తద్వారా సాధారణ పెరుగుదల, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. పిల్లలు నిద్రలేమి కారణంగా పాఠశాల పనితీరు తగ్గడం, ఉదయాన్నే లేవడంలో ఇబ్బంది, చిరాకు, మానసిక కల్లోలం, నిరాశ మొదలైన అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

పెద్దలకు తక్కువ నిద్ర అవసరమా?

కొన్ని పరిశోధనల్లో వయస్సుతో పాటు నిద్ర అవసరం మారకపోవచ్చు అని తెలియజేశాయి. కానీ అవసరమైన నిద్రను పొందే సామర్థ్యం వయస్సుతోపాటు తగ్గిపోతుంది. వృద్ధులకు వారి అనారోగ్యాలు, మందుల కారణంగా నిద్రపోయే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వయస్సుతోపాటు నాణ్యమైన నిద్ర కూడా తగ్గుతుంది. వృద్ధుల నిద్ర నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. దీని వెనుక నిద్రలేమి, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్, స్లీప్ అప్నియా, అర్ధరాత్రి మూత్రవిసర్జన వంటి అనేక కారణాలు ఉంటాయి.

పిల్లల నుంచి పెద్దలు, వృద్ధుల వరకు ఎవరికి ఎంత నిద్ర అవసరమంటే?

వయస్సు ఎన్ని గంటల నిద్ర అవసరం
 నవజాత శిశువు 1-2 11 నుంచి 14
పాఠశాలకు ముందు 3-5 10 నుంచి 13
పిల్లలు 6-13 9 నుంచి 11
యుక్తవయస్సులో
14-17 8 నుంచి 10
పెద్దలు 18-60 7 నుంచి 9
వృద్ధులు 60 సంవత్సరాల పైన 6 నుంచి 8

Also Read: Roasted Onions: కాల్చిన ఉల్లిపాయలు తింటున్నారా ?.. అయితే మీరు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

Health Tips: షుగర్‌ పేషెంట్లకి గమనిక.. ఎండాకాలం వీటి విషయంలో జాగ్రత్త..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే