AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: బీట్‌రూట్ జ్యూస్ ఇలా ట్రై చేస్తే సూపర్.. రుచితో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

వేసవి కాలంలో శరీరానికి ఎక్కువగా ఉపయోగపడే జ్యూస్‌లలో బీట్‌రూట్ కూడా ఉంటుంది. ఇది ఇతర పండ్లు, కూరగాయల జ్యూస్‌ల కంటే హిమోగ్లోబిన్‌ను పెంచడంలో వేగంగా పని చేస్తుంది.

Health Tips: బీట్‌రూట్ జ్యూస్ ఇలా ట్రై చేస్తే సూపర్.. రుచితో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Beetroot
Follow us
Venkata Chari

|

Updated on: May 01, 2022 | 6:56 AM

బీట్‌రూట్‌(Beetroot)ను ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. అంటే సలాడ్, వెజిటబుల్, ఊరగాయ, చట్నీ, జామ్, జ్యూస్(juice) మొదలైన రూపంలో ఎవరికి నచ్చినట్లు వారు హ్యాపిగా తీసుకోవచ్చు. అయితే, బీట్‌రూట్‌లోని అన్ని ప్రయోజనాలను పొందాలంటే మాత్రం సలాడ్ రూపంలో తీసుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. మీరు దాని పై తొక్క తీసి, నల్ల ఉప్పుతో కలిపి, టొమాటో, దోసకాయ లాంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే బీట్‌రూట్‌లోని అన్ని లక్షణాలతో పాటు ఫైబర్(Fiber) పోషణను కూడా పొందుతారు. బీట్‌రూట్‌ను సలాడ్‌గా తినడానికి అందరూ ఇష్టపడరు. ఇటువంటి పరిస్థితిలో దాని రసాన్ని తయారు చేసుకోవచ్చు. బీట్‌రూట్ లక్షణాలను మరింత పెంచడానికి ఇతర పండ్లు, కూరగాయలను కలపవచ్చు. ఎలాంటి వాటితో కలిపి తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బీట్‌రూట్ + అల్లం + నిమ్మకాయ

2. బీట్‌రూట్ + టొమాటో

3. బీట్‌రూట్ + ఆరెంజ్

4. బీట్‌రూట్ + దోసకాయ

5. బీట్‌రూట్ + లెమన్

6. బీట్‌రూట్ + యాపిల్

7. బీట్‌రూట్ + బచ్చలికూర

8. బీట్‌రూట్ + పైనాపిల్

9. బీట్‌రూట్ + పుదీనా + నిమ్మకాయ

10. బీట్‌రూట్ + సెలెరీ

11. బీట్‌రూట్ + ప్లం

12. బీట్‌రూట్ + బ్లూబెర్రీ

13. బీట్‌రూట్ + గ్రేప్స్

వేసవి కాలంలో పైన పేర్కొన్న 13 రకాలుగా బీట్‌రూట్ జ్యూస్‌ని తయారు చేసి తీసుకోవచ్చు. ఇలా చేస్తే బీట్‌రూట్‌లోని అన్ని లక్షణాలను కూడా పొందుతారు. ఇలా చేసుకోవడం వల్ల బీట్‌రూట్ రుచి మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టదు.

ఎలాంటి వారు తాగాలి..

బలహీనతతో బాధపడేవారు

చాలా త్వరగా అలసిపోయే వ్యక్తులు

ఊపిరి ఆడకపోవడం

తక్కువ హిమోగ్లోబిన్ ఉన్న వ్యక్తులు

తమ శరీరాన్ని యవ్వనంగా ఉంచుకోవాలనుకునే వారు

తమ బుగ్గలపై సహజమైన మెరుపును కోరుకునే వారు

జీర్ణక్రియ సక్రమంగా లేని వ్యక్తులు

మలబద్ధకం సమస్య ఉన్నవారు

ఈ విషయాలను గుర్తుంచుకోండి..

లూజ్ మోషన్స్‌లో ఉన్నప్పుడు బీట్‌రూట్ జ్యూస్ తాగకండి. షుగర్ పేషెంట్లు బీట్‌రూట్ జ్యూస్‌ని విడిగా పంచదార వేసి తీసుకోకూడదు. కాగా, అన్ని వయసుల వారు ఈ రసాన్ని తీసుకోవచ్చు. కానీ కడుపునొప్పి సమయంలో దీన్ని తీసుకోవద్దు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సలహాలుగా మాత్రమే తీసుకోండి. TV9Telugu వీటిని నిర్ధారించలేదు. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు, వైద్యుడిని సంప్రదించడం మంచింది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Roasted Onions: కాల్చిన ఉల్లిపాయలు తింటున్నారా ?.. అయితే మీరు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

Health Tips: మీరు చేస్తున్న ఈ 4 తప్పుల వల్లే అధిక బరువు.. అస్సలు చేయవద్దు..!