Health Tips: మీరు చేస్తున్న ఈ 4 తప్పుల వల్లే అధిక బరువు.. అస్సలు చేయవద్దు..!
Health Tips: మారిన జీవనశైలి వల్ల చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్యమైనది అధిక బరువు. దీనివల్ల చాలా
Health Tips: మారిన జీవనశైలి వల్ల చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్యమైనది అధిక బరువు. దీనివల్ల చాలా వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇందులో అధిక రక్తపోటు, డయాబెటీస్, గుండె జబ్బులకి గురవుతున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. అయితే చాలామంది తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు. దీనివల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. కాబట్టి మీ బరువు పెరగడానికి నాలుగు ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం.
1. బయటి ఆహారం తినడం
బరువు పెరగడానికి అతి పెద్ద కారణం బయటి ఆహారం తీసుకోవడం. ఆకలిగా ఉన్నప్పుడు ఫాస్ట్ ఫుడ్ తినేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల బరువు పెరగడమే కాకుండా అనేక వ్యాధులకు గురవుతారు.
2. రాత్రంతా మెలకువగా ఉండకూడదు
రాత్రంతా మేల్కొని ఉండే అలవాటు బరువు పెరగడానికి దారి తీస్తుంది. నేటి యువత రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. దీని కారణంగా బరువు పెరుగుతున్నారు. నిద్ర సరిపడా లేకుంటే ఎక్కువగా ఆహారం తింటారు. దీంతో విపరీతంగా బరువు పెరుగుతారు.
3. శీతల పానీయాలు తాగడం
శీతల పానీయాలు తాగే అలవాటు బరువుని పెంచుతుంది. వేసవి కాలంలో శీతల పానీయాలు తాగే వ్యక్తులు, ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
4. నిరంతరం ఒకే చోట కూర్చోవడం
నేటి జీవనశైలిలో చాలామంది ఒకే చోట గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారు. దీని కారణంగా బరువు పెరుగుతున్నారు. అందుకే ఒకే చోట గంటల తరబడి కూర్చోకూడదు. మధ్య మధ్యలో కాస్త లేచి అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.