Viral Video: కరెంట్‌ స్తంభం ఎక్కిన ఎలుగుబంటి.. పక్కనే హై వోల్టేజ్ వైర్.. తర్వాత ఏం జరిగిందంటే..!

Viral Video: మీరు తరచుగా జూలో లేదా అడవుల్లో ఎలుగుబంట్లని చూసి ఉంటారు. వీటిని ప్రపంచంలోని తెలివైన జంతువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇవి వేటగాడు

Viral Video: కరెంట్‌ స్తంభం ఎక్కిన ఎలుగుబంటి.. పక్కనే హై వోల్టేజ్ వైర్.. తర్వాత ఏం జరిగిందంటే..!
Bear Climbs
Follow us
uppula Raju

|

Updated on: Apr 30, 2022 | 11:41 AM

Viral Video: మీరు తరచుగా జూలో లేదా అడవుల్లో ఎలుగుబంట్లని చూసి ఉంటారు. వీటిని ప్రపంచంలోని తెలివైన జంతువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇవి వేటగాడు వేసే వల గురించి ముందుగానే గ్రహిస్తాయి. అటువైపునకు వెళ్లవు. ఎలుగుబంట్ల గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎలుగబంట్లు ఈత కొడుతాయి. దీంతో పాటు చాలా వేగంగా పరిగెత్తగలవు. పొడవైన చెట్లను ఎక్కగలవు. ఇవి కొంతవరకు హింసాత్మక జీవులు కాబట్టి దూరంగా ఉండటం మంచిది. వాటి దాడి చాలా ప్రాణాంతకం. అయితే ఎలుగుబంట్లకి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తరచుగా వైరల్‌ అవుతుంటాయి. వీటిని చూసిన నెటిజన్లు చాలా ఆశ్చర్యపోతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. దాని గురించి తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ఎలుగుబంటి కరెంట్ స్తంభంపై ఉండటం మనం గమనించవచ్చు. అక్కడ ఉన్న ఒక కాకి దానిని ముక్కుతో పొడుస్తుంటుంది. ఎందుకంటే దాని గూడు అక్కడ ఉండటం మనం వీడియోలో చూడవచ్చు. ఎలుగుబంటి గూడులో మూతిపెట్టి ఏదో తినడానికి ప్రయత్నిస్తుంటుంది. వాస్తవానికి గూడులో కాకి గుడ్లు, పిల్లలు ఉండే అవకాశం ఉంది. నిజానికి ఎలుగుబంట్లు సర్వభక్షకులు. మాంసంతో పాటు మొక్కలు, ఆకులు మొదలైన వాటిని తింటాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎలుగుబంటి కరెంట్ స్తంభం ఎక్కడం చూసి ఆశ్చర్యపోతున్నారు. కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు.

ఈ షాకింగ్ వీడియోని ఒక నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 53 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 22 వేలకు పైగా వీక్షించగా వందలాది మంది లైక్ చేశారు. చాలామంది కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలని తెలుపుతున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

మరిన్ని వైరల్ వీడియోలకి ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: చిరుత వేగం ముందు ఎవ్వరైనా దిగదుడుపే.. వేట మామూలుగా లేదుగా..!

Sunrise Points: ఈ ప్రదేశాలలో సూర్యోదయాన్ని చూస్తే మైమరచిపోతారు..!

Education Loan: ఈ బ్యాంకులు చౌకైన విద్యా రుణాలు అందిస్తున్నాయి.. ఈఎంఐ ఎంతంటే..?