AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heatstroke: వడ దెబ్బ బారిన పడకుండా ఉండాలంటే.. ఈ ఆహారాలు తీసుకోండి..

Summer: ఎండాకాలం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కష్టం. విపరీతమైన వేడిలో వడదెబ్బ కారణంగా కొంత మంది ప్రాణాలు కూడా పోతాయి. ఇంతకీ ఈ హీట్‌స్ట్రోక్ అంటే ఏమిటి?

Shaik Madar Saheb
|

Updated on: Apr 30, 2022 | 1:30 PM

Share
ఎండాకాలం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కష్టం. విపరీతమైన వేడిలో వడదెబ్బ కారణంగా కొంత మంది ప్రాణాలు కూడా పోతాయి. ఇంతకీ ఈ హీట్‌స్ట్రోక్ అంటే ఏమిటి? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగినప్పుడు వడదెబ్బ తగులుతుంది. వేసవిలో ఎవరైనా ఎప్పుడైనా హీట్‌స్ట్రోక్‌కు గురవుతారు.

1 / 8
హీట్ స్ట్రోక్.. ఎలా అర్థం చేసుకోవాలి.? నిలబడి ఉన్నప్పుడు తేలికపాటి మైకము కళ్లు తిరగుతాయి. ఇతర లక్షణాలు పెదవులు, నాలుక పొడి బారిపోవడం, తలనొప్పి, విపరీతమైన అలసట, వికారంచ, కండరాల తిమ్మిరి ఉంటుంది.

2 / 8
వేసవిలో ఎల్లప్పుడూ వదులుగా ఉండే తేలికపాటి కాటన్ దుస్తులను ధరించండి. ఇది శరీరాన్ని తగినంత చల్లగా ఉంచుతుంది. వేడిలో పని లేదా వ్యాయామం వంటివి పరిమిత సమయంలో మాత్రమే చేయండి. ఎండవేడిమికి అలవాటు పడని వారు ఇలాంటి సమయంలో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.

3 / 8
మజ్జిగ: వేడి వాతావరణంలో మజ్జిగ తప్పనిసరిగా తాగండి. మజ్జిగ దాహాన్ని పోగొట్టి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అదే సమయంలో వేడి వాతావరణంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి మజ్జిగ తాగండి.

4 / 8
హైడ్రేటెడ్‌గా ఉండండి: ఈ సమయంలో పుష్కలంగా నీరు, కొబ్బరి నీరు వంటి సహజ ఎలక్ట్రోలైట్లను తాగండి. వేడి రోజులలో ఫిట్‌గా ఉండేందుకు శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడం చాలా కష్టం. ఆరోగ్యంగా, పౌష్టికంగా ఉండటానికి మంచి ఆహారాలను తీసుకోండి.

5 / 8
పండ్లు - కూరగాయలు: వేసవిలో సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం చాలా అవసరం. మామిడి, పుచ్చకాయలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. భోజనానికి ముందు ఈ పండ్లను తింటే చాలా కాలం పాటు సంతృప్తిగా ఉంటుంది. బొప్పాయి ఈ సమయంలో జీర్ణక్రియకు ఉత్తమమైన పండు. సలాడ్లు, ఆకుకూరలు కూడా తినండి.

6 / 8
జ్యూస్‌లు: పెరుగు, ఐస్ క్యూబ్స్‌తో చేసిన పానీయాలు వేసవిలో చల్లగా ఉంచుతాయి. మీకు నచ్చిన పండ్లతో మీరు వివిధ రకాల పానీయాలను తయారు చేసుకోవచ్చు.

7 / 8
కర్బూజ: కర్జూజ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, డి, బి6, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. ఇది హైడ్రేటింగ్ మాత్రమే కాదు, మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

8 / 8