- Telugu News Photo Gallery Rohit sharma birthday unknown facts about captain of the indian cricket team rohit sharma know details in bengali
Rohit Sharma: రోహిత్ శర్మ బర్త్ డే స్పెషల్.. హిట్‌మ్యాన్ ఖాతాలో ఉన్న ఐదు అరుదైన రికార్డులివే..
Happy Birthday Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు నేడు పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. మరి ఈ హిట్‌మ్యాన్ తన క్రికెట్ కెరీర్ లో సాధించిన 5 అరుదైన రికార్డులేవో తెలుసుకుందాం రండి.
Updated on: Apr 30, 2022 | 12:02 PM

వన్డే క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు మరియు సిక్స్‌లు బాదిన రికార్డులు కూడా హిట్‌మ్యాన్ పేరిటే ఉన్నాయి. 2014లో కోల్‌కతాలో శ్రీలంకపై 264 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 163 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో ఈ స్కోరు సాధించాడు

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు (264 పరుగులు) సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ అంతర్జాతీయ క్రికెటర్ కూడా ఈ రికార్డును అధిగమించలేకపోయాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు (టెస్టులలో 6 సెంచరీలు, వన్డేలలో 29 సెంచరీలు మరియు T20 క్రికెట్‌లో 4 సెంచరీలు) కలిగిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ కూడా ఒకడు.

2019 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ మొత్తం 5 సెంచరీలు చేశాడు. ప్రపంచకప్‌లో మరే క్రికెటర్ కూడా ఇన్నేసి శతకాలు సాధించలేదు.




