Sarkaru vaari paata: సూపర్‌ స్టార్‌ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. సర్కారు వారి పాట ట్రైలర్‌ వచ్చేస్తోంది..

Sarkaru vaari paata: సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా నుంచి..

Sarkaru vaari paata: సూపర్‌ స్టార్‌ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. సర్కారు వారి పాట ట్రైలర్‌ వచ్చేస్తోంది..
Follow us
Narender Vaitla

|

Updated on: May 01, 2022 | 8:54 PM

Sarkaru vaari paata: సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా, క్షణాల్లో వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఇటీవలే విడుదలైన కళావతి, పెన్ని, టైటిల్‌ ట్రాక్‌ సాంగ్స్‌ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలస్తూ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. మహేష్‌కు జోడిగా తొలిసారి మహానటి కీర్తి సురేశ్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. గీత గోవిందంలాంటి సక్సెస్‌ తర్వాత పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో కూడా సర్కారు వారిపై అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సినిమా తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచుతున్నారు చిత్ర యూనిట్‌.

ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు సర్కారు వారి పాట మాసివ్‌ మాస్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అంతకుముందే హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ థియేటర్‌లో అభిమానుల కోసం 3 గంటలకే ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

ఒక్క రోజు ముందే ట్రైలర్‌పై ఆసక్తి పెంచేందుకు సర్కారు వారి పాట నుంచి మేకర్స్‌ ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో కీర్తిసురేశ్‌ మహేష్‌ మెడపై ఉన్న ట్యాటును నిమురుతున్నట్లుగా చూపించారు. అలాగే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించి మహేష్‌ పవర్‌ ఫుల్‌గా కుర్చీలో కూర్చున్న షాడో స్టిల్‌తో కూడిన ఓ చిన్న వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో ట్రైలర్‌పై ఆసక్తిని రెట్టింపు చేసింది. మరి మహేష్‌ నుంచి వస్తోన్న ఈ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ ట్రైలర్‌ ఎలాంటి రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Gmail Security: జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని అనుమానమా.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి..

WhatsApp Crime: ప్రేమతో మీ భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెడుతున్నారా..? అయితే జర జాగ్రత్త గురూ..

WhatsApp Crime: ప్రేమతో మీ భార్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెడుతున్నారా..? అయితే జర జాగ్రత్త గురూ..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?