Viral Photo: అందాల సింధూరం.. మన తెలుగింటి ముద్ద మందారం.. ఎవరో గుర్తించారా..?

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. అరుదైన ఫోటోస్‏తో అందమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు నెటిజన్స్.

Viral Photo: అందాల సింధూరం.. మన తెలుగింటి ముద్ద మందారం.. ఎవరో గుర్తించారా..?
Actress Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: May 01, 2022 | 5:37 PM

Trending Photo: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. అరుదైన ఫోటోస్‏తో అందమైన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు నెటిజన్స్. అలాగే సెలబ్రెటీలు కూడా తమ చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఇక తమ అభిమాన స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్‏ చూసేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఈ త్రోబ్యాక్ ట్రెండ్ తెగ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఓ సెలబ్రిటీ చిన్ననాటి ఫోటో నెట్టింట్లో సర్కులేట్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. క్యూట్ క్యూట్‏గా చిలిపి చిన్నారి ఎవరో గుర్తించారా.. ఆమె టాలీవుడ్‌(Tollywood)లోని ఓ బడా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. హోస్ట్‌గా, నటిగా, నిర్మాతగా సత్తా చాటుతుంది. ఏంటి.. ఇంకా గుర్తించలేదా..? మేమే చెప్పేస్తాం. ఆ ఫోటోలో ఉంది ‘మెగా డాటర్‌’ నిహారిక కొణిదెల.

కొణిదెల నిహారికను తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు. మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి. ఆమెను అన్నలందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ‘ఢీ’ షోతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత నటిగా సత్తా చాటారు. ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ సిరీస్‌తో నిర్మాతగానూ మారారు. నిహారిక ముద్దు.. ముద్దు మాటలను ఇష్టపడని వారుండరు. 2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని.. ఈ మెగా డాటర్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అయితే పెళ్లి తర్వాత కూడా నటిగా, నిర్మాతగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా నిహా.. ఫుల్ యాక్టివ్ ఉంటారు. తన ఫ్యామిలీ మెంబర్స్, తన మూవీస్‌కు సంబంధించిన డీటేల్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల ఆమె జిమ్‌లో షూట్ చేసిన వీడియో ఒకటి షేర్ చేయడంతో.. నెటిజన్లు బాగా ట్రోలింగ్ చేశారు. అంతేకాదు ఆమె పబ్‌కి వెళ్లడం.. అక్కడ డ్రగ్స్ పట్టుబడటం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేశారు నిహారిక. చాలా గ్యాప్ అనంతరం.. ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. 8 వారాల్లో తాను మూడు లెస్సన్స్ నేర్చుకున్నానంటూ ఆమె ఒక పోస్ట్ చేయగా అది కాస్తా.. నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: నడిరోడ్డపై అతిగాడి ఓవరాక్షన్.. డ్రామాను రక్తి కట్టించిన హీరో విశ్వక్ సేన్‌