Hyderabad: నడిరోడ్డపై అతిగాడి ఓవరాక్షన్.. డ్రామాను రక్తి కట్టించిన హీరో విశ్వక్ సేన్‌

ప్రాంక్‌ల పైత్యం ముదిరి పాకాన పడింది. రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేసే వరకు వెళ్లింది. పబ్లిసిటీ కోసం సినిమా మేకర్స్ ఇలాంటి అతి గాళ్లను ప్రొత్సహించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Hyderabad: నడిరోడ్డపై అతిగాడి ఓవరాక్షన్.. డ్రామాను రక్తి కట్టించిన హీరో విశ్వక్ సేన్‌
Prank
Follow us
Ram Naramaneni

|

Updated on: May 01, 2022 | 5:42 PM

ప్రాంక్‌ల ఓవరాక్షన్ ఎక్కువైంది. అతిగాళ్లకి సినిమాల ప్రమోషన్ పేరుతో నాలుగు రాళ్లు సంపాదించుకునే అవకాశం వచ్చింది. దీంతో రెచ్చిపోతున్నారు. కెమెరా కనపడితే చాలు నానా యాగీ చేస్తూ.. న్యూసెన్స్ చేస్తున్నారు. రీచ్ ఎక్కువగా ఉండటంతో దర్శకనిర్మాతలు, హీరోలు వీరిని తమ చిత్రాల ప్రమోషన్ కోసం హైర్ చేసుకుంటున్నారు. తాజాగా అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ ప్రమోషన్ కోసం ఓ ప్రాంక్ పైత్యం గాడు నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం పేరుతో డ్రామాలాడాడు. నోటికొచ్చింది మాట్లాడుతూ.. రోడ్డుపై వెళ్లేవారికి ఇరిటేషన్ తెచ్చాడు. అక్కడే ఉన్న నటుడు విశ్వక్ సేన్ కూడా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను పండించాడు. అసలు అక్కడ ఏం జరగుతుందో తెలియక జనాలు గందరగోళానికి గురయ్యారు. నడిరోడ్డుపై ఈ ప్రాంక్ గాడి అతి చూసిన.. యాక్టివిస్టులు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. సినిమా ప్రమోషన్‌ కోసం ఇంత అరాచకం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. హీరో సహా అక్కడున్న వారపై న్యూసెన్స్‌ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఈ అతిగాడితో పాటు మరికొందరు సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు.. థియేటర్ ముందు వాలిపోతారు. మొదటి షో సినిమా చూసి.. వెటకారంతో కూడిన రివ్యూలు చెబుతుంటారు. పరిధికి మించిన నాటకాలు వేస్తుంటారు. సినిమా ఎంజాయ్ చేద్దామని థియేటర్‌కు వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఈ పైత్యం గాళ్ల ఓవరాక్షన్ పెద్ద టార్చర్‌గా మారింది.

Also Read: Repalle: గర్భిణీపై పైశాచికం.. సామూహిక అత్యాచారం.. ఏపీలో వరుస మర్డర్లు, గ్యాంగ్‌ రేప్స్‌ కలకలం