AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Excise Scam: వీకెండ్ పార్టీ లకు దొంగ పర్మిషన్లు.. బయటపడిన ఆబ్కారీ ఇంటిదొంగల నయా స్కామ్..

Excise Department Scam: ఆబ్కారీ శాఖలో పనిచేసే కొందరికి కూడా లక్షల డబ్బు దర్జాగా వచ్చి పడుతుంది. కేవలం పది నిమిషాల పని.. పన్నెండు వేలు పాకెట్ లో వచ్చి చేరుతుంది. ప్రభుత్వం ఇస్తూనట్టు వెకెండ్ పార్టీ లకు దొంగ పర్మిషన్ లెటర్ ఇస్తే చాలు.

Excise Scam: వీకెండ్ పార్టీ లకు దొంగ పర్మిషన్లు.. బయటపడిన ఆబ్కారీ ఇంటిదొంగల నయా స్కామ్..
Hyderabad Excise Scam
Sanjay Kasula
|

Updated on: May 01, 2022 | 9:31 PM

Share

ఇంటి దొంగని ఈశ్వరుడు అయిన పట్టలేడు అంటారు. కానీ ఆబ్కారీ శాఖలో(Excise department)ఉన్న ఇంటి దొంగలను కాస్త లేట్ అయిన పట్టుకున్నారు అధికారులు. అక్రమ అనుమతులు ఇస్తూ అక్రమ ఆస్తులను మూట కట్టుకుంటున్నారు. మరి ఈ ఇంటి దొంగలు చేసిన పనేంటో చూడండి. అసలే కాసులు కురిపించే శాఖ ఆబ్కారీ శాఖ. అంటే ప్రభుత్వానికే కాదండోయి.. ఆబ్కారీ శాఖలో పనిచేసే కొందరికి కూడా లక్షల డబ్బు దర్జాగా వచ్చి పడుతుంది. కేవలం పది నిమిషాల పని.. పన్నెండు వేలు పాకెట్ లో వచ్చి చేరుతుంది. ప్రభుత్వం ఇస్తూనట్టు వెకెండ్ పార్టీ లకు దొంగ పర్మిషన్ లెటర్ ఇస్తే చాలు. కాసులు ఫుల్లు.

గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో ప్రతీ నెలా నగర శివార్లలోపార్టీ ల కోసం 700 నుండి 1200 వరకు దరఖాస్తులు వస్తుంటాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక రోజు అనుమతి కి 9 వేలు, 5 స్టార్ హోటల్స్ లో స్థాయిని బట్టి 12 వేల నుండి 20 వేలు ఉంటుంది. ఆ పార్టీలకు వచ్చే రష్ ని బట్టి 50వేల నుంచి రెండున్నర లక్షల వరకు చెల్లించాలి. అయితే ఇదంతా ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్సైజ్ శాఖలో లో ఉన్న ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు ఇక్కడే చక్రం తిప్పారు. పాత అనుమతుల పేపర్స్ లో తేదీలు మార్చి. వాట్స‌ప్ లో పంపిస్తున్నారు. ఆ 12 వేల ను జేబులో వేసుకుంటున్నారు.

అన్ని రోజులు మనవి కావు అన్నట్టు.. ఉన్నతాధికారులకు ఈ మేటర్ చేరడంతో.. ఈ ఇంటి దొంగల బాగోతం బయటపడింది. శంషాబాద్, గచ్చిబౌలి, హై టెక్ సిటీ ల లో నకిలీ పత్రాలు ఇచ్చినట్టు తేలింది. ఇప్పటికి ఆ ముగ్గురు జూనియర్ అసిస్టెంట్ లను సస్పెండ్ చేశారు. ఈ స్కాంలో జునియ‌ర్ అసిస్టెంట్ గా ప‌నిచేస్తున్న సాయి బాబు, వివేక్, సాలోద్దీన్ పాత్ర ఉండ‌టంతో విధుల్లో నుంచి త‌ప్పించారు ఉన్న‌తాధికారులు. ఇందులో ఒక ఇన్స్పెక్టర్ పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ స్కాం వెలుగులోకి రావ‌డంతో ఉన్న‌త స్దాయి విచార‌ణ‌కు అదేశించారు ఎక్సైజ్ క‌మిష‌నర్. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. ఇంట‌ర్న‌ల్ ఎంక్వైరీ త‌ర్వాత మరికొంత మంది పై వేటు ప‌డే అవ‌కాశం ఉంది.

పెద్ద అధికారుల నిఘా లోపంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఇప్పటికి అయిన ఇలాంటి వాటి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి: Telangana: పోలీసు ఉద్యోగ అభ్యర్థులు అలర్ట్‌.. తస్మాత్‌ జాగ్రత్త.. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు

Manjima Mohan: మంజిమాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు.. తనదైన శైలిలో సమాధానమిచ్చిన మలయాళ ముద్దుగుమ్మ..