TS Group 1 Notification: గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ.. చివరి తేదీ ఎప్పుడంటే..
TSPSC Group 1 Notification 2022: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్1తో పాటు పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రూప్1 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ నేటి (సోమవారం) నుంచి ప్రారంభమైంది....
TSPSC Group 1 Notification 2022: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్1తో పాటు పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రూప్1 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ నేటి (సోమవారం) నుంచి ప్రారంభమైంది. సోమవారం ఉదయం నుంచే లింకులు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 18 శాఖల్లో 503 పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 2న మొదలు కానున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 31తో ముగియనుంది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.inలో అప్లై చేసుకోవాలని అభ్యర్థులు సూచించారు.
ఈ క్రమంలోనే ఓటీఆర్‌ను అప్ డేట్ చేసుకోవాలని అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచించింది. అప్ డేట్ చేసిన తర్వాతే దరఖాస్తుల చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు ఫామ్‌లో ఓటీఆర్ డేటానే తీసుకోనున్నారు. గడువు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లై చేసుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
* టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉండే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త ఉత్తర్వుల ప్రకారం సవరణ చేసిన, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేయాలి. అనంతరం మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఓటీఆర్ డేటాబేస్‌లో అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కమ్యూనిటీ తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ వివరాలు సరైనవేనని నిర్ధారించుకున్నాక ‘కన్ఫర్మ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నాయని భావిస్తే ‘నో’పై క్లిక్ చేయాలి. దీంతో ఓటీఆర్ విండో తెరుచుకుంటుంది. అందులో సంబంధిత వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేస్తే తిరిగి అప్లికేషన్ వస్తుంది. ఆ తర్వాత ‘కన్ఫర్మ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* దరఖాస్తు ఫీజు రూ.200, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. పరీక్ష ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు టీఎస్‌పీఎస్సీ మినహాయింపు ఇచ్చింది. 18- 44 ఏళ్లలోపు నిరుద్యోగ అభ్యర్థులూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వారంతా నిరుద్యోగులమంటూ డిక్లరేషన్ పత్రం సమర్పించాలి. కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు లేదని కమిషన్ స్పష్టం చేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: RBI On Coronavirus: కరోనాతో భారీగా ఆర్ధిక నష్టం.. కోలుకోవాలంటే 12 ఏళ్లు పడుతుందంటున్న ఆర్బీఐ
UGC NET: యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే
Excise Scam: వీకెండ్ పార్టీ లకు దొంగ పర్మిషన్లు.. బయటపడిన ఆబ్కారీ ఇంటిదొంగల నయా స్కామ్..