Telangana: పోలీసు ఉద్యోగ అభ్యర్థులు అలర్ట్.. తస్మాత్ జాగ్రత్త.. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు
Telangana: సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ..
Telangana: సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో ఉద్యోగ నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఇక తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ వెబ్‌సైట్లను సృష్టిస్తు్న్నారు. డీజీపీ కార్యాలయంలోని రిక్రూట్‌మెంట్ బోర్డు విభాగానికి చెందిన అధికారులు ఇంటర్నెట్‌లో నకిలీ వెబ్‌సైట్లను గుర్తించారు. వెంటనే దీనిని ఇంటర్నెట్ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వెబ్‌సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నిరుద్యోగులను ఆసరా చేసుకుని పెద్ద ఎత్తున మోసం చేసేందుకు కొందరు రెడీగా ఉంటున్నారని హెచ్చరిస్తు్న్నారు.
ప్రభుత్వ వెబ్‌సైట్ల లాగే నకిలీ వెబ్‌సైట్లు:
ఇక ప్రభుత్వ వెబ్‌సైట్‌ల లాగానే నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖతో పాటు ప్రత్యేక పోలీసు విభాగం, అగ్నిమాపక, జైళ్ల శాలలో వేర్వేరు స్థాయిలో మొత్తం 16,614 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇక ఇదే తరహాలోనే నకిలీ వెబ్‌సైట్లు సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసేటప్పుడు పొరపాటున నకిలీ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు నమోదు చేసుకుంటే అసలు వెబ్‌సైట్‌లో మీ వివరాలు కనిపించవు. దీంతో తీవ్ర ఆందరగోళానికి దారి తీస్తుందని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆ నకిలీ వెబ్‌సైట్లను తొలగించే పనిలో ఉన్నారు పోలీసు శాఖ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: