LPG Gas Cylinder Price: వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!
LPG Gas Cylinder Price: ప్రతి నెల 1వ తేదీన దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. ఏప్రిల్ నెలల కూడా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. తాజాగా మే 1వ..
LPG Gas Cylinder Price:ప్రతి నెల 1వ తేదీన దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. ఏప్రిల్ నెలల కూడా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. తాజాగా మే 1వ తేదీన కూడా పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (Oil Marketing Companies). వాణిజ్య గ్యాస్ సిలిండర్ (Commercial LPG Cylinder) పై రూ.104 పెంచాయి. ఇక 14 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై ఎలాంటి మార్పు లేదు. దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో కాస్త ఊరటనిచ్చినట్లయ్యింది. ముందే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో మే 1న సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చాయి ఆయిల్ కంపెనీలు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.102.50 పెరిగి రూ.2,355కి చేరుకుంది. గత నెల ఏప్రిల్ 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.268.50 పెరిగింది.
దేశీయంగా ఎల్పీజీ ధరలను చమురు కంపెనీలు పెంచకపోవడం ఊరటనిచ్చే అంశం. దీంతో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు కొంత ఊరట లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ లేకుండా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.949.5గా ఉంది. కోల్‌కతాలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.976, ముంబైలో రూ.949.50, చెన్నైలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇప్పుడు రూ.965.50గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: