AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Repalle: గర్భిణీపై పైశాచికం.. సామూహిక అత్యాచారం.. ఏపీలో వరుస మర్డర్లు, గ్యాంగ్‌ రేప్స్‌ కలకలం

బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. బాధిత మహిళ భర్తను కొట్టి.. వలస కూలీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది.

Repalle: గర్భిణీపై పైశాచికం.. సామూహిక అత్యాచారం.. ఏపీలో వరుస మర్డర్లు, గ్యాంగ్‌ రేప్స్‌ కలకలం
Representational Image
Ram Naramaneni
|

Updated on: May 01, 2022 | 1:17 PM

Share

వరుస మర్డర్లు, గ్యాంగ్‌ రేప్స్‌… ఏపీలో కలకలం రేపుతున్నాయ్‌. ఎన్నడూ లేనివిధంగా జరుగుతోన్న సీరియల్‌ రేప్స్‌… తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయ్‌. విజయవాడ, గుంటూరు గ్యాంగ్‌ రేప్స్‌పై రచ్చ జరుగుతుండగానే… రేపల్లెలో మరో సామూహిక అత్యాచారం జరగడం ఆంధ్రాలో అలజడి రేపుతోంది. ఏకంగా రైల్వే స్టేషన్‌లోనే గర్భిణీపై గ్యాంగ్ రేప్‌ జరగడంతో రేపల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించారు. సాయంత్రం నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్.. రేపల్లె పోలీస్ స్టేషన్‌లోనే ఉండి కేసును పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కాగా ఈ ఘటనతో ఏపీలో మరోసారి రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మహిళపై రేప్‌ అండ్‌ మర్డర్‌ జరుగుతోందన్నారు TDP MLA అనగాని సత్యప్రసాద్‌. రేపల్లెను గంజాయిగా హబ్‌గా మార్చేశారని మండిపడ్డారు. రేపల్లె నడిబొడ్డున గ్యాంగ్‌ రేప్‌ జరిగిందంటే, రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఎలాగున్నాయో అర్ధమవుతోందంటున్నారు అనగాని సత్యప్రసాద్‌. దిశ చట్టం అంటూ గొప్పలు చెప్పుకుంటోన్న వైసీపీ ప్రభుత్వం…ఈ అత్యాచారాలను ఎందుకు అరికట్టలేకపోతోందని ప్రశ్నించారు. జగన్ పాలనలో ఏపీ బిహార్‌లా మారిందని ఆయన ధ్వజమెత్తారు.

ఇన్సిడెంట్‌ జరిగిన అరగంటలోనే నిందితులను పట్టుకున్నారని అంటున్నారు మంత్రి మేరుగ నాగార్జున. టీడీపీ హయాంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఇటీవల స్టేట్‌ వైడ్‌గా జరిగిన మూడు మర్డర్లలో తెలుగుదేశం నేతల హస్తం ఉందంటూ ఆరోపించారు. రైల్వే స్టేషన్‌లో గ్యాంగ్‌ రేప్‌ జరగడం దారుణమన్నారు ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌. రైల్వే స్టేషన్లలో రక్షణ వైఫల్యంపై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరామన్నారు వాసిరెడ్డి పద్మ.

Also Read: Telangana: అర్ధరాత్రి కారు బోల్తా.. అందులోని వారు ఎస్కేప్.. క్లియర్ చేసేందుకు వెళ్లిన పోలీసులు షాక్