HIT Second Case: హిట్ సీక్వెల్‌కు ముహుర్తం ఖరారు.. ఆ రోజే చిక్కుముడి విప్పడానికి సిద్ధమైన అడివి శేషు..
HIT Second Case: యంగ్ హీరో విశ్వక్ సేన్ (vishwak sen) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'హిట్' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సైలేశ్ కొలను అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది...
HIT Second Case: యంగ్ హీరో విశ్వక్ సేన్ (vishwak sen) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘హిట్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సైలేశ్ కొలను అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మర్డర్ కేసును చేధించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశ్వక్ మంచి నటనను కనబరిచాడు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే హిట్ సినిమా విడుదలైన తర్వాతే హిట్‌కు సీక్వెల్ రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే సీక్వెల్ తెరకెక్కిన ‘హిట్ 2’లో విశ్వేక్ సేన్ స్థానంలో అడివి శేషు హీరోగా నటిస్తున్నాడు. విశాఖటపట్నంలో జరిగే ఓ కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జూలై 29న హిట్ 2 సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. గూఢచారి, ఎవరు వంటి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేషు ఇప్పుడు మరోసారి ఇదే తరహా పాత్రతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Something DANGEROUS about to unfold in the HIT universe!
Get ready for spine chilling suspense on the 29th of July. #HIT2OnJuly29 #Hit2@NameisNani @KolanuSailesh @PrashantiTipirn #MeenakshiChaudhary @maniDop @Garrybh88 #JohnStewartEduri @ManishaADutt @SVR4446 pic.twitter.com/GfcAdjTj5K
— Adivi Sesh (@AdiviSesh) May 2, 2022
మరిన్ని సినిమాల వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Fat Problem: ఈ ఆహార పదార్థాలు తీసుకోండి చాలు.. కొవ్వు కరిగిపోతుంది..!
Hyderabad: కొడుకు చేసిన పని తల్లిదండ్రుల పాలిట శాపంగా మారింది.. ఆస్పత్రి పాలయ్యేలా చేసింది
PM Modi Europe Visit: యూరప్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!