AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త ‘సెక్యూరిటీ గార్డ్’

ఎన్నికల కౌంటింగ్‌లో కొత్త ‘సెక్యూరిటీ గార్డ్’

Phani CH
|

Updated on: Feb 13, 2026 | 9:52 AM

Share

సిరిసిల్లలోని కౌంటింగ్ కేంద్రం వద్ద కోతుల బెడదను నివారించడానికి అధికారులు వినూత్న ఆలోచన చేశారు. ఎన్నికల పత్రాలకు రక్షణగా, కొండముచ్చు భారీ కటౌట్లు, ఫోటోలు ఏర్పాటు చేశారు. సహజసిద్ధంగా కోతులు భయపడే కొండముచ్చులను ఉపయోగించి, ఎన్నికల భద్రతను పెంపొందించారు. ఈ 'దేశీ జుగాడ్' పద్ధతితో కోతుల సంచారం గణనీయంగా తగ్గి, కౌంటింగ్ ప్రశాంతంగా సాగింది.

సాధారణంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రం అంటే భారీ పోలీసు బందోబస్తు, ఐడీ కార్డుల తనిఖీలు, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. కానీ సిరిసిల్లలోని సినారె కళామందిరం కౌంటింగ్ కేంద్రం వద్ద మాత్రం ఓ వినూత్నమైన ‘భద్రతా అధికారి’ అందరినీ ఆకర్షిస్తోంది. అదే… కొండముచ్చు! అయితే ఇది నిజమైనది కాదు, కేవలం దాని భారీ కటౌట్లు మరియు ఫోటోలు మాత్రమేనండోయ్‌! కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో గత కొన్ని రోజులుగా కోతుల సంచారం విపరీతంగా పెరిగింది. గుంపులు గుంపులుగా వస్తున్న కోతులు కిటికీలు, మెట్ల ద్వారా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ సిబ్బందిని హడలెత్తిస్తున్నాయి. అత్యంత కీలకమైన ఎన్నికల పత్రాలను చింపేస్తాయేమోనని, కౌంటింగ్ సమయంలో అంతరాయం కలిగిస్తాయేమోనని అధికారులు ఆందోళన చెందారు. దీంతో కోతులను తరిమికొట్టేందుకు లాఠీలు పట్టుకోవడం కంటే, ప్రకృతి సిద్ధమైన భయాన్ని ఉపయోగించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగా కౌంటింగ్ హాల్ ప్రవేశ ద్వారాలు, ప్రాంగణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొండముచ్చు ఫోటోలను ఏర్పాటు చేశారు. సహజంగా కొండముచ్చును చూస్తే కోతులు దరిదాపుల్లోకి రావడానికి భయపడతాయి. పోలీసుల కంటే ఈ కొండముచ్చులే తమకు ఎక్కువ రక్షణ కల్పిస్తున్నట్టున్నాయంటూ సరదాగా చర్చించుకున్నారు అక్కడి సిబ్బంది. అయితే అధికారులు వినూత్నంగా చేసిన ఈ ఏర్పాటు మంచి ఫలితాలనే ఇస్తోంది. ఈ కొండముచ్చు ఫోటోలు పెట్టినప్పటినుంచి కోతుల బెడద గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఉత్కంఠ భరితంగా సాగే ఎన్నికల ఫలితాల వేళ, ఈ వినూత్న ఆలోచన అటు సిబ్బందిలోనూ, ఇటు అభ్యర్థుల్లోనూ కాసేపు నవ్వులు పూయించింది. సాంకేతికతతో పాటు ఇలాంటి ‘దేశీ జుగాడ్’ ఆలోచనలు కూడా ఎన్నికల నిర్వహణలో కీలకంగా మారడం చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: ఆ సంతోషాన్ని, భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేను

Andhrapradesh: 99 పైసలకే కంపెనీలకు భూములు..మండలిలో మాటల మంటలు

Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధర.. ఇవాళ తులం ఎంతంటే

భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్

మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా అమెరికా వాడుకుంది.. పాక్‌ మంత్రి అసహనం