TOP 9 ET: ఆ సంతోషాన్ని, భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేను
రాజాసాబ్ పై ట్రోల్స్ విమర్శలు.. ఆగిపోవడం కాదు కదా.. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి అవి మరింత ఎక్కువగా వస్తున్నాయి. ఓటీటీలో రాజాసాబ్ మూవీలోని కొన్ని సీన్లను మరింత డీటేలింగ్‌గా.. చూస్తున్న కొందరు నెటిజన్లు.. ప్రభాస్ డూప్ షాట్స్‌ను కనిపెట్టి మరీ నెట్టింట వైరల్ చేస్తున్నారు. డైరెక్టర్ మారుతీని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఈ మూవీలో విలన్ గ్యాంగ్‌లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే నటుడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరు.. సినిమాల్లో తన తొలి అడుగును గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. పునాది రాళ్లు సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలిరోజు పిబ్రవరి పదకొండే.. అంటూ ట్వీట్ చేశారు. తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చిన వేళ… తనలో పుట్టుకొచ్చిన ఆనందాన్ని.. భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేనంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఆ క్షణం ఇప్పటికీ.. నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుందని.. అదో అందమైన చందమామ కథ లాంటి అనుభూతి అంటూ రాసుకొచ్చారు చిరు.అంతేకాదు ఈ సందర్భంగా.. తనకు ఆ తొలి అవకాశం ఇచ్చిన పునాది రాళ్లు.. దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతోనే… నటనలో తన ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయంటూ తన ట్వీట్‌లో కోట్ చేశారు. పునాది రాళ్లు సినిమాలోని తన ఫోటోలను కూడా షేర్ చేశారు చిరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Andhrapradesh: 99 పైసలకే కంపెనీలకు భూములు..మండలిలో మాటల మంటలు
Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధర.. ఇవాళ తులం ఎంతంటే
భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్
మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా అమెరికా వాడుకుంది.. పాక్ మంత్రి అసహనం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

