AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా అమెరికా వాడుకుంది.. పాక్‌ మంత్రి అసహనం

మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా అమెరికా వాడుకుంది.. పాక్‌ మంత్రి అసహనం

Phani CH
|

Updated on: Feb 12, 2026 | 9:38 PM

Share

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా, అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. స్వప్రయోజనాల కోసం అమెరికా పాకిస్తాన్‌ను ఆఫ్ఘన్ యుద్ధంలో వాడుకొని, ఆపై వదిలేసిందని అన్నారు. దీనివల్ల పాక్ హింస, తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని ఖవాజా ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాతో చేతులు కలపడం పెద్ద తప్పని, దాని పర్యవసానాలను ఇప్పటికీ అనుభవిస్తున్నామని ఆయన పార్లమెంట్‌లో పేర్కొన్నారు.

అగ్రరాజ్యం అమెరికా తన స్వప్రయోజనాలు, రాజకీయ ప్రాధాన్యాలు, అవసరాల కోసం పాకిస్థాన్‌ను వాడుకుందని, తర్వాత తమ దేశాన్ని టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపడేసిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఆగ్రహించారు. పాక్ పార్లమెంట్‌లో మాట్లాడిన ఖవాజా అమెరికా తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. 1999 తర్వాత అమెరికాతో పాకిస్థాన్ చేతులు కలపడం చాలా పెద్ద తప్పని అభిప్రాయపడ్డారు. అఫ్గానిస్థాన్ విషయంలో అమెరికాతో చేతులు కలపడం పాకిస్తాన్‌ చేసిన అతిపెద్ద తప్పు. దాని వల్ల పాకిస్థాన్ చాలా నష్టపోయింది. దాని పర్యావసానాలను ఇప్పటికీ అనుభవిస్తోంది. అవసరం తీరిన తర్వాత పాకిస్థాన్‌ను అమెరికా పట్టించుకోలేదు. పాక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయమూ చేయలేదు. సైనిక పాలకులు జియా ఉల్ హక్‌, పర్వేజ్ ముషారఫ్‌ వల్ల పాక్ తనకు సంబంధం లేని యుద్ధాల్లో పాల్గొనాల్సి వచ్చింది. ప్రయోజనం పొందిన అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఆ పరిణామాలు పాక్‌ను వెంటాడుతున్నాయి అని ఖవాజా అన్నారు. 2001, సెప్టెంబర్ 11‌ దాడుల తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేయడానికి అమెరికాతో పాకిస్థాన్ చేతులు కలిపింది. అమెరికాతో కలిసి తాలిబన్లతో యుద్ధానికి దిగింది. కొద్ది సంవత్సరాల తర్వాత అమెరికా వెనక్కి తగ్గింది. అయితే తాలిబన్లతో యుద్ధం కారణంగా పాక్‌ మాత్రం హింస, తీవ్రవాదం, ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకుపోయింది. అమెరికాతో చేతుల కలపడం ద్వారా కొని తెచ్చుకున్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేమని పాక్ పార్లమెంట్‌లో ఖవాజా అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘రాంగ్‌సైడ్‌’ డ్రైవింగ్‌పై పోలీసుల కొరడా..

ప్లాన్ B కాదు.. C, D కూడా రెడీ చేసిన స్టార్స్

Hrithik Roshan: హృతిక్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

Suriya: సూర్య కోసం వెయిటింగ్ లో ఉన్న దర్శకులు

Rukmini Vasanth: రష్మికను ఫాలో అవుతున్న రుక్మిణీ వసంత్