AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్

భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్

Phani CH
|

Updated on: Feb 12, 2026 | 9:41 PM

Share

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వైట్‌హౌస్ ఫ్యాక్ట్‌షీట్‌లో కీలక మార్పులు చేసింది. భారత్ కొనుగోళ్ల పదజాలం మార్చడం, కొన్ని పప్పుధాన్యాలు, డిజిటల్ పన్ను ప్రస్తావన తొలగించడం ప్రధానం. ఈ సవరణలు భారత్ నిబద్ధతను తగ్గించేలా ఉండగా, అధికారిక వివరణ లేకపోవడంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒప్పందంపై స్పష్టత లోపించిందనే వాదనలకు దారితీస్తోంది.

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అధికారిక ఫ్యాక్ట్‌షీట్‌లో వైట్‌హౌస్ నిశ్శబ్దంగా కీలక మార్పులు చేసింది. ఒప్పంద వివరాలు ప్రకటించిన కొన్ని రోజులకే ఈ సవరణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, భారత్ కొనుగోళ్లకు సంబంధించిన పదజాలాన్ని మార్చడంతో పాటు, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, డిజిటల్ పన్నుల ప్రస్తావనను తొలగించింది. ముందు విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో, అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ “నిబద్ధతతో ఉంది” అని రాసారు. అయితే, సవరించిన వెర్షన్‌లో ఈ పదాన్ని “కొనుగోలు చేయాలని భావిస్తోంది” అని మార్చారు. ఒప్పందంపై భారత్ వైపు నుంచి ఉన్న కట్టుబాటు తీవ్రతను ఈ మార్పు తగ్గించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పాటు, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గిస్తుందన్న జాబితా నుంచి “కొన్ని రకాల పప్పుధాన్యాలు” అనే పదాన్ని తొలగించారు. ఇది భారత రైతులకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. అదే విధంగా, భారత్ తన డిజిటల్ సేవల పన్నును తొలగిస్తుందన్న వాక్యాన్ని కూడా ఫ్యాక్ట్‌షీట్ నుంచి పూర్తిగా తొలగించారు. ఈ మార్పులను వైట్‌హౌస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎలాంటి ప్రకటన లేకుండా చేసింది. ఈ సవరణలకు గల కారణాలపై అమెరికా ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక వివరణ రాలేదు. దీంతో ఒప్పందంలోని అంశాలపై ఇరు దేశాల మధ్య అవగాహన విషయంలో స్పష్టత లోపించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా అమెరికా వాడుకుంది.. పాక్‌ మంత్రి అసహనం

‘రాంగ్‌సైడ్‌’ డ్రైవింగ్‌పై పోలీసుల కొరడా..

ప్లాన్ B కాదు.. C, D కూడా రెడీ చేసిన స్టార్స్

Hrithik Roshan: హృతిక్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్

Suriya: సూర్య కోసం వెయిటింగ్ లో ఉన్న దర్శకులు