AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎదురు కట్నమైనా ఇస్తా..! అమ్మాయిలో అలాంటి క్వాలిటీస్ ఉండాలి : జబర్దస్త్ నరేష్

ప్రముఖ టీవీ ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ కామెడీ ప్రోగ్రాం.. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది నటీ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా, మరికొంతమంది దర్శకులుగా , కమెడియన్స్ గా సెటిల్ అయ్యారు.

ఎదురు కట్నమైనా ఇస్తా..! అమ్మాయిలో అలాంటి క్వాలిటీస్ ఉండాలి : జబర్దస్త్ నరేష్
Naresh
Rajeev Rayala
|

Updated on: Feb 13, 2026 | 10:37 AM

Share

జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు నరేష్. తనకున్న వైకల్యాన్నే.. తనకు ప్లస్‌గా మార్చుని బుల్లి తెరపై రాణిస్తున్నాడు. కమెడియన్ గా నవ్వులు పూయిస్తున్నాడు. జబర్దస్త్ నరేష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన పెళ్లి, కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. గతంలో నరేష్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పెళ్లీడు వచ్చిందని, త్వరలో ఓ ఇంటివాడు కావాలనే కోరిక బలంగా ఉందని నరేష్ చెప్పుకొచ్చాడు. నాకంటూ ఒక కుటుంబం ఉండాలి, నాకంటూ పిల్లలు ఉండాలి అనే ఆశయం తనలో ఉందని నరేష్ తెలిపాడు. తన పిల్లలకు మంచి భవిష్యత్తును కచ్చితంగా ఇస్తానని, తనకు మంచి ఆస్తి ఉందని, కాబట్టి భవిష్యత్తులో వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు.

 ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

తన కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై నరేష్ మాట్లాడుతూ.. ఆమె తన కంటే కొద్దిగా ఎత్తుగా ఉండాలని, అంటే కనీసం ఒకటిన్నర అడుగు ఎక్కువ ఎత్తు కోరుకుంటున్నానని సరదాగా చెప్పాడు. ముఖ్యంగా, తన తల్లిదండ్రులను బాగా చూసుకునే వ్యక్తిత్వం ఉండాలని, అలాగే తన వృత్తిని, పనిని పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి కావాలని చెప్పుకొచ్చాడు. ఈవెంట్లకు వెళ్లేటప్పుడు, షూటింగ్‌ల సమయంలో తాను ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా టచ్‌లో ఉంటానని, తన దూరాన్ని, పని స్వభావాన్ని అర్థం చేసుకుంటే చాలని అన్నాడు.

కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్

ఇటీవల ఓ షోలో పెళ్లి చూపుల ప్రోమో గురించి అడగగా.. గతంలో ఒక ఎపిసోడ్‌లో వచ్చిన అమ్మాయితో తన పెళ్లి కేవలం ఒక ప్రమోషనల్ కాన్సెప్ట్ మాత్రమేనని, నిజమైన సంబంధం కాదని నరేష్ స్పష్టం చేశాడు. ఆ అమ్మాయి కూడా ఆ రోజే వచ్చిందని, అదంతా కేవలం ఎపిసోడ్ కోసం మాత్రమేనని ఎపిసోడ్ చివరిలోనే తాము స్పష్టత ఇచ్చామని తెలిపాడు. కట్నాల గురించి ప్రస్తావించగా, తనకు పెద్దగా కట్నాలు అవసరం లేదని, ఒకవేళ అమ్మాయి అడిగితే మాత్రం తాను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సరదాగా బదులిచ్చాడు.

ఇవి కూడా చదవండి

నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా
పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..