AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యాడు శ్రీహాన్. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొన్నాడు. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియో పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు
Shrihan
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2026 | 12:11 PM

Share

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో శ్రీహన్ ఒకరు. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా శ్రీహన్ పాపులర్ అయ్యాడు. అలాగే మంచి ఫ్యాన్స్ ను కూడా సొంతం చేసుకున్నాడు. శ్రీహన్‌ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొన్నాడు. అలాగే ఆయన ప్రేయసి సిరి హనుమంతు గురించి కూడా అందరికి తెలిసే ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు సిరి , శ్రీహన్ ఇద్దరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సిరి ఇటీవలే నారి నారి నడుమ మురారి సినిమాలో కనిపించింది. అలాగే శ్రీహాన్ కూడా ప్రధాన పాత్రలో వర్జిన్ బాయ్స్ అనే సినిమాలో నటించాడు. ఇదిలా ఉంటే శ్రీహాన్ తాజాగా చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అతని పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకూ ఆయన ఏం చేశాడంటే..

ఆ ఇద్దరు హీరోలు నాతో చాలా ఫ్రెండ్లిగా ఉంటారు.. ఆసక్తికర విషయం చెప్పిన టాలీవుడ్ విలన్

తాజాగా శ్రీహాన్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఫుల్ గా మద్యం తాగేసి రోడ్డు పక్కన పడుకున్నాడు. సరిగ్గా రోడ్డు డివైడర్ పక్కన పడుకున్నాడు.. అదే సమయంలో శ్రీహాన్ అటుగా కార్లో వెళ్తూ అతన్ని చూసి కారు ఆపి అతన్ని జాగ్రత్తగా రోడ్డుకు దూరంగా ఉంచాడు. మత్తులో ఉన్న అతడిని లేపి రోడ్డు దాటించాడు. ఈవీడియో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తన సందేశాన్ని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

అచ్చం మామ పొలికే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ చూశారా..

నేను కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి ఫుల్లుగా తాగేసి రోడ్డుపై పడి ఉన్నాడు. అతనికి ఏం సమస్యలున్నాయో, ఏం బాధలున్నాయో.? ఎందుకు తాగాడో మనకు అవసరం లేదు.. కానీ, వాహనాలు అన్నీ అతడి పక్కనుంచే స్పీడ్ గా వెళ్తున్నాయి. పైగా అతడి చేయి, కాలు రోడ్డుపై ఉన్నాయి. స్పీడ్ గా వెళ్ళేటప్పుడు లేదా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే పెద్ద వాహనాలకు అతను కనిపించడు.. దాని వల్లే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అక్కడ ఉన్నవారు చూస్తూ ఉండిపోయారు. ఒక్క నిమిషం అతనికి సాయం చేసి ఉంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడవచ్చు. రేపు ఏదైనా జరిగి ఆ విషయాన్నీ, వీడియోను సోషల్ మీడియాలో చూసి అయ్యో పాపమ్ అనుకోవాల్సి ఉండదు అంటూ శ్రీహాన్ రాసుకోచ్చాడు.

ముట్టుకుంటే కందిపోతుందేమో..! మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?

View this post on Instagram

A post shared by Shrihan (@imshrihan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ