AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది.. ఈయన భార్య కూడా సినిమాలు చేస్తుందా.? అల్లు అర్జున్ తో చేసిందిగా..!!

సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకొక్కసారి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సినిమాల్లో కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. అలాంటి పాత్రలో చేయడం లో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు నటుడు మురళీశర్మ.

ఇదేందయ్యా ఇది.. ఈయన భార్య కూడా సినిమాలు చేస్తుందా.? అల్లు అర్జున్ తో చేసిందిగా..!!
Murali Sharma
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2026 | 12:14 PM

Share

ప్రస్తుతం ఏ సినిమా చూసినా ఇప్పుడు ఆయనే కనిపిస్తున్నాడు. ఆయన లేకుండా సినిమాలే రావడం లేదు అంటే అది అతిశయోక్తి కాదేమో.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు నటుడు మురళీ శర్మ.. విభిన్నమైన పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు మురళీ శర్మ. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటిస్తూ.. వారెవ్వా అనిపిస్తున్నారు. హీరో తండ్రి పాత్రైనా.. విలన్ పాత్రైనా తనదైన శైలిలో మెప్పిస్తున్నారు. అంతే కాదు కొన్ని సినిమాల్లో కామెడీ విలన్ గానూ కనిపించి ఆకట్టుకున్నారు. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో కనిపించి  విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం లో సినిమాలో మురళీ శర్మ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించారు. మురళీ శర్మ టీవీ సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. మురళీ శర్మ ముందుగా హిందీ సినిమా రాజ్ లో నటించారు. ఆ తర్వాత షారుఖ్‌ఖాన్ మైహూనా లో నటించాడు.

ఇదికూడా చదవండి :ఏంటి సుధా ఈవిడ..! మరీ ఇంత హాట్‌గా ఉందేంటి గురూ.!! హీరోయిన్స్ కూడా పనికిరారు

ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేశారు మురళీ శర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఈ వర్సటైల్ యాక్టర్.  మురళీశర్మనే కాదు ఆయన భార్య కూడా సినిమాల్లో నటిస్తారు. ఆమె కూడా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మురళీ శర్మ భార్య పేరు.. అశ్వినీ కల్‌శేఖర్. ‘బ్రదినాథ్’ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా నటించింది ఈవిడే.

ఇదికూడా చదవండి :అప్పుడు క్యూట్‌గా ఉండేది కదరా.. ఇలా మారిపోయిందేంటీ..!! బికినీ ఫొటోలతో రచ్చ చేస్తున్న మిరపకాయ్ భామ

ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అశ్వినీ కల్‌శేఖర్ మరాఠీ టెలివిజన్, హిందీ సినిమా, టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించారు. తెలుగులో అల్లు అర్జున్ బ్రదినాథ్ సినిమాతో పాటు రవి తేజ హీరోగా నటించిన నిప్పు సినిమాలోనూ విలన్ భార్యగా నటించారు అశ్వినీ కల్‌శేఖర్. ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాలోనూ నటించింది అశ్వినీ కల్‌శేఖర్. ప్రస్తుతం అశ్వినీ కల్‌శేఖర్ హిందీ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. మురళీ శర్మ తెలుగు సినిమాలు చేస్తుంటే.. ఆయన భార్య అశ్వినీ కల్‌శేఖర్ హిందీలో సినిమాలు చేస్తున్నారు. తాజాగా అశ్వినీ కల్‌శేఖర్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే.. ఇద్దరు స్టార్ హీరోలు ఇరగదీశారు

Ashwini Kulshekar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us