AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటి సుధా ఈవిడ..! మరీ ఇంత హాట్‌గా ఉందేంటి గురూ.!! హీరోయిన్స్ కూడా పనికిరారు

చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు హీరోయిన్స్ కు మించి అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. హీరో చెల్లిగానో, లేదుగా హీరోయిన్ ఫ్రెండ్ గానో నటిస్తూ మెప్పిస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. వారిలో ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఒకరు. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఏంటి సుధా ఈవిడ..! మరీ ఇంత హాట్‌గా ఉందేంటి గురూ.!! హీరోయిన్స్ కూడా పనికిరారు
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2026 | 1:20 PM

Share

కొంతమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ ను మించే అందం ఉన్నప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భామ కూడా ఆకోవకే చెందింది. విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ, దర్శకుడిగా సందీప్ రెడ్డి ఇద్దరి క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అటు సందీప్ రెడ్డి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ షాలిని పాండే ఒక్కతే సక్సెస్ కాలేకపోయింది.

అలాగే ఈ సినిమాలో నటించిన చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఆమె.. ఆ ముద్దుగుమ్మ పేరు అదితి మ్యాకల్. ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది. అలాగే హీరోయిన్ గాను సినిమాలు చేసి ఆకట్టుకుందిఈ ముద్దుగుమ్మ. చిన్న వయసులోనే కూచిపూడి నేర్చుకొని, పలు ప్రదర్శనలు ఇచ్చి శభాష్‌ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసిన ఈ భామ.. పలు ఫ్యాషన్ షోలోనూ పాల్గొంది. సినిమాల పై మోజుతో సినిమాల్లోకి అడుగుపెట్టింది ఈ చిన్నది. యూట్యూబ్‌ వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించింది.  తను నటించిన పాప పి సుశీల, ముద్దపప్పు ఆవకాయ్‌, పాష్‌ పోరీస్‌ లతో సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అర్జున్‌ రెడ్డి సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అమీ తుమీ, రాధ,  మిఠాయ్‌, దెబ్బకు ఠా.. దొంగల ముఠా, నేనులేని నా ప్రేమకథ  సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సహాయక పాత్రలు చేస్తుంది. ఇటీవలే శోభిత నటించిన చీకట్లో సినిమాలో కనిపించింది. ఇక ఈ అమ్మడు బయట చాలా హాట్ గురూ.. సోషల్ మీడియాలో ఈ చిన్నది హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది. ఈ బ్యూటీ ఫోటోలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Aditi Myakal (@aditi.myakal)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us