AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యమా హాట్ గురూ..! రోజాతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ముద్దుగుమ్మల వ్యక్తిగత విషయాలు, చిన్ననాటి ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్‌కు సంబందించిన ఫోటోలు, వీడియోలు, రకరకాల విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ క్రేజీ బ్యూటీ చిన్ననాటి ఫోటో చక్కర్లు కొడుతుంది.

యమా హాట్ గురూ..! రోజాతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
Roja
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2026 | 8:57 AM

Share

ఇప్పుడున్న జనరేషన్ లో సోషల్ మీడియా అనేది లైఫ్ లో ఓ భాగం అయిపొయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు కొందరు. ఇక సోషల్ మీడియా వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ స్టా గ్రామ్ పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన నిమిషాల్లో ఫోన్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఇక సెలబ్రెటీల సంగతి సరేసరి.. ముఖ్యంగా హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తమ రెగ్యులర్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోలు, వీడియోలు, విశేషాలు పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ముద్దుగుమ్మ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో నటి రోజాతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఎలాంటి కుర్రాడైన ఫిదా అవ్వాల్సిందే. ఆమె చాలా ఫెమస్. ఆమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఇంతకూ ఆమెను గుర్తుపట్టడం కొంచం కష్టమే.. ఇప్పుడు ఆమె హాట్ బ్యూటీగా టాలీవుడ్ లో రచ్చ లేపుతోంది. ఇంతకూ ఆమె ఎవరంటే.. పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కాదు.. హాట్ బ్యూటీ అషు రెడ్డి. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ క్రేజీ బ్యూటీ. ముఖ్యంగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో  చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ.

దాంతో ఈ చిన్నదాని పేరు బాగా వైరల్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. బిగ్ బాస్ లో తనదైన ఆటతోపాటు అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆషు కొన్ని సినిమాల్లోనూ నటించింది. చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ హీరోయిన్ గా మాత్రం చేయలేదు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీకి సినిమా ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఆమెకు అంతగా ఆఫర్స్ రాలేదు.  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు వరుసగా షోలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది ఈ హాట్ బ్యూటీ. ఈ అమ్మడు లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.