AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి సినిమాలోనే లిప్ లక్స్‌తో రెచ్చిపోయింది.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత..! కానీ కలిసిరాని అదృష్టం

చాలా మంది ముద్దుగుమ్మ ఒకే ఒక్క సినిమాతో కేజ్ తెచ్చుకొని ఓవర్ నైట్ స్టార్స్ అవుతుంటారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తొలి సినిమాలోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది.

తొలి సినిమాలోనే లిప్ లక్స్‌తో  రెచ్చిపోయింది.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత..! కానీ కలిసిరాని అదృష్టం
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2026 | 11:00 AM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అంత సులభం కాదు. ఒకప్పుడు హీరోయిన్ గా అవకాశాలు రావడం కోసం చాలా కష్టపడే వారు.. నాలుగు, ఐదు సినిమాలు చేస్తే కానీ సరైన గుర్తింపు వచ్చేది కాదు అప్పట్లో కానీ ఇప్పుడు అలా కాదు. చాలా మంది హీరోయిన్ ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలా చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ కూడా ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కొంతమంది ఆమెను దేవత అంటూ పూజిస్తున్నారు కూడా.. ఒక్క సినిమాకే నిజానికి ఒక్క సాంగ్ తోనే కుర్రకారును తన వెంట కుక్కపిల్లల్లా తిరిగేలా చేసుకుంది ఆమె. ఏం వయ్యారం రా బాబు అంటూ కుర్రాళ్లు నోరెళ్ళబెట్టి చూస్తుంటారు ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

ఆ అందగత్తె ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో ఉన్న హీరోయిన్ తన అందంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. ఆమె ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ దివ్య భారతి. ఇప్పటివరకు ఈ బ్యూటీ చేసింది ఒకే ఒక్క సినిమా అది కూడా తమిళ్ లో.. జీవి ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచ్ లర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది దివ్య భారతి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఆమె అందానికి, వయ్యారాలు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు.ఈ సినిమాలో ఓ సాంగ్ తెగ పాపులర్ అయ్యింది. ఆ సాంగ్ లో లిప్ లాక్స్ లో రెచ్చిపోయింది దివ్య భారతి.

ఇవి కూడా చదవండి

ఆతర్వాత మరోసారి జీవి ప్రకాష్ తో కలిసి కింగ్ స్టన్ అనే సినిమా చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తోంది. తెలుగులో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది దివ్య భారతి. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ అంటూ కుర్రకారు ఈ చిన్నదాని ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. అందాలతో గత్తరలేపుతుంది ఈ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us