AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే.. ఇద్దరు స్టార్ హీరోలు ఇరగదీశారు

హారర్ సినిమాలు చూడాలంటే చాలా మంది ఇష్టముంటుంది. కానీ ఒంటరిగా చూసేందుకు మాత్రం భయంతో వణికిపోతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం థియేటర్లలోనే వణుకు పుట్టించింది. కానీ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా ఓటీటీలో చక్రం తిప్పుతుంది.

ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే.. ఇద్దరు స్టార్ హీరోలు ఇరగదీశారు
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Feb 10, 2026 | 11:00 AM

Share

భయపెట్టే సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఇప్పుడు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ఈ జానర్ చిత్రాలకు ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. అందుకే మేకర్స్ ఈ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు జనాలు ఎక్కువగా భయానక కథలు, దెయ్యాలు, ఉత్కంఠభరితమైన కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు. ఓటీటీల్లోనూ అలాంటి సినిమాలే ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి వారికోసమే ఇప్పుడు ఈ భయానక సినిమా గురించి తెలుసుకుందాం.! ఈ సినిమాలో ఇద్దరు బడా హీరోలు ఓ స్టార్ హీరోయిన్ నటించారు. పెద్ద హీరోలు హారర్ సినిమాలు చేయడం చాలా అరుదు. కానీ ఈ సినిమాలో ఇద్దరూ స్టార్ హీరోలు కలిసి నటించారు.

సినిమాలో ప్రతి సీన్ వణుకుపుట్టించ్చిది.. ఒక్కసారి మొదలు పెడితే వదిలిపెట్టకుండా సినిమా చూస్తారు. ఈ సినిమా ఓ ట్రాన్స్ లో తీసుకెళ్తుంది గురూ.. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కింది. అదే షైతాన్. ఈ సినిమాలో అజయ్ దేవగన్, మాధవన్ కలిసి నటించారు. అలాగే స్టార్ హీరోయిన్ జ్యోతిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. కబీర్ రిషి (అజయ్ దేవగన్) అనే ఉద్యోగి తన భార్య జ్యోతి (జ్యోతిక), కూతురు జాన్వీ (జాన్కీ బోడివాలా), కొడుకు ధ్రువ్‌తో కలిసి డీరాడూన్ దగ్గర ఉన్న తమ ఫార్మ్‌హౌస్‌కి వెళ్తారు. సెలవుల్లో అక్కడ గడపాలని, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. దారిలో ఒక రెస్టారెంట్‌లో ఆగి భోజనం చేస్తుంటే, వనరాజ్ (ఆర్. మాధవన్) అనే అపరిచితుడు వాళ్లతో స్నేహంగా మాట్లాడుతాడు. జాన్వీకి ఒక స్వీట్ ఇస్తాడు. ఆ తర్వాత వాళ్లతో పాటే ఫార్మ్‌హౌస్‌కి వస్తాడు, ఫోన్ చార్జ్ చేసుకోవాలని, సాయం కావాలని అంటాడు.

కానీ తర్వాత నిజ రూపం తెలుస్తుంది. వనరాజ్ ఒక భయంకరమైన మాంత్రికుడు. అతను జాన్వీ మనసును పూర్తిగా కంట్రోల్ చేసేస్తాడు. ఆమె అతని మాటలు వినాల్సిందే, అతని ఆదేశాలు పాటించాల్సిందే అవుతుంది. ఇది హిప్నాటిక్ కంట్రోల్, బ్లాక్ మ్యాజిక్ కాంబినేషన్. వనరాజ్ లక్ష్యం ఏంటంటే జాన్వీని తీసుకెళ్లి, ఇతర అమ్మాయిలతో పాటు ఒక భయంకరమైన రిచ్యువల్‌లో ఉపయోగించడం. అతను మనుషుల ఫ్రీ విల్‌ని తీసేసి, తన దురాశలకు బానిసల్ని చేయాలనుకుంటాడు. ఆతర్వాత ఏం జరిగింది.? హీరో ఆ మాంత్రికుడిని ఎలా ఎదుర్కున్నాడు.? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?