AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం అమ్మాయిని.. షాక్ ఇచ్చిన సీరియల్ బ్యూటీ

తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన షోల్లో బిగ్ బాస్ షో ఒకటి. చాలా భాషల్లో ఆకట్టుకున్న బిగ్ బాస్ షో తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ షో ఏడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే ఓక ఓటీటీ సీజన్ కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ ద్వారా చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

గూగుల్ నన్ను హిందువుని చేసింది.. కానీ నేను ముస్లిం అమ్మాయిని.. షాక్ ఇచ్చిన సీరియల్ బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 13, 2026 | 10:17 AM

Share

సీరియల్స్ ద్వారా చాలా మంది భామలు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నారు. సినిమా హీరోయిన్ ఎంత క్రేజ్ తెచ్చుకుంటున్నారో సీరియల్ భామలు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. సీరియల్స్ లో తన అందంతో నటనతో ఆకట్టుకున్న భామలు కొందరు సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అదేవిధంగా మరికొంతమంది బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొని ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే కొంతమంది బిగ్ బాస్ తర్వాత కనిపించకుండా పోయిన వారు కూడా ఉన్నారు.

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

కానీ ఆ అమ్మడు అలా కాదు. ఈ బ్యూటీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పెద్ద కష్టమేమి కాదు ఆమెను గుర్తుపట్టడం. బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి మరింత దగ్గరైంది హమీదా..ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సీరియల్ లో ఆమె పాత్ర మొదట్లో నెగిటివ్ రోల్ లో ఉన్నప్పటికీ ఆతర్వాత ఆమె పాత్రను పాజిటివ్ యాంగిల్ లోకి మార్చారు. ఈ క్యారెక్టర్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఆ సీరియల్ ఆమె పాత్ర నుంచి తప్పించారు. ఆతర్వాత  ఓ ఓటీటీలో డాన్స్ షోలో మెంటర్ గా చేసింది హమీద.

ఇవి కూడా చదవండి

కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్

సీరియల్స్ లో చాలా పద్దతిగా చీర కట్టులో కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుంది. సీరియల్స్‌ను ఫాలో అయ్యేవారికి ఈ అమ్మడిని పద్దతిగా చూస్తే ఉంటారు. కానీ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ మాత్రం మాములుగా ఉండదు. తాజాగా హమీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హమీద మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో హామీదను.. నువ్వు చర్చ్ కి వెళ్తావు, మసీదుకు వెళ్తావు, గుడికి వెళ్తావు స్పెషల్ ఏంటి.? అని యాంకర్ అడగ్గా.. దానికి హమీద సమాధానమిస్తూ..  నేను చిన్నప్పటి నుంచి చదివిని స్కూల్ సపరేట్ ముస్లిమ్ స్కూల్ కాదు. అప్పుడు నేను కలకత్తాలో ఉండేదాన్ని.. అక్కడ హిందూ, ముస్లిం డిఫరెన్స్ ఉండదు. మా స్కూల్ లో పూజ చేస్తారు. సరస్వతీ పూజ ఉండేది. సరస్వతి పూజ , దుర్గా పూజ, కాళీమాత పూజ నా ఫ్రెండ్స్ తో తిరగడం వల్ల అలవాటు అయ్యింది. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయి అని ఎవరికి తెలియదు. గూగుల్‌లోనే నా రిలీజియన్ హిందూ అని ఉంటుంది. కాబట్టి తనకు ఆ డిఫరెన్స్ లేదని చెప్పుకొచ్చింది హమీద.

నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
కేవలం 30 నిమిషాల్లో కరకరలాడే జిలేబీ.. ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
స్వామి భద్రేశ్‌దాస్‌కు ‘వేదాంతవిద్యా విశ్వగురు’ గౌరవం
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
10 ఏళ్లుగా ఎవ్వరూ టచ్ చేయలే.. ఏకైక భారత ఆటగాడిగా భారీ రికార్డ్..!
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
ఊర కుక్కలు వర్సెస్ నీటి కుక్కలు.. పోరులో గెలుపు ఎవరిది..?
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
గుంటూరు స్పెషల్ కాకరకాయ కారం.. ఇలా చేసి ఒక్కసారి తింటే ఇక వదలరు!
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో భారీ నగదుతోపాటు ల్యాప్‌టాప్ ప్రత్యక్షం
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
పోలీస్ స్టేషన్ లో మనోజ్ రచ్చ.. సారీ చెప్పాలంటూ డిమాండ్..
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్
జస్ట్‌ 45 మినెట్స్.. హైదరాబాద్‌ టూ విజయవాడ.. ఎగిరి గంతేసే న్యూస్
హుషారు పిట్టలు ట్రైలర్ వచ్చేసింది..
హుషారు పిట్టలు ట్రైలర్ వచ్చేసింది..
'అమ్మాయిల దుస్తులపై కాదు.. వాళ్ల పనితీరుపై దృష్టి పెట్టాలి'
'అమ్మాయిల దుస్తులపై కాదు.. వాళ్ల పనితీరుపై దృష్టి పెట్టాలి'